వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదరిక నిర్మూలన: ఒబామా వ్యాఖ్యలు, మన్మోహన్‌పై ఒమర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేశారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. గత కొన్నిఏళ్లుగా లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించిన ఘనత మన్మోహాన్‌కే దక్కుతుందని ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.

History will judge former Prime Minister Manmohan Singh kindly: Omar Abdullah

మన్మోహన్ సరిగ్గానే వ్యవహరించారని, చరిత్ర ఆయన పట్ల మరింత సానుకూల వైఖరితో వ్యవహరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్‌లో పేదరిక నిర్మూలనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం సిరి ఫోర్ట్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పైవిధంగా స్పందించారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల పర్యనట సందర్భంగా మన్మోహన్ సింగ్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఒమర్ అబ్దుల్లా ఆశ్చర్యం వక్తం చేశారు. ఢిల్లీలోని సిరి ఫోర్టు స్టేడియంలో మంగళవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ పేదరికాన్ని తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం సౌర విద్యుత్తు లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.

ప్రస్తుతానికి పేదరికంలో మగ్గిపోతున్నా, వాళ్ల పిల్లలకు అద్భుతమైన అవకాశాలు రావడం ఖాయమని చెప్పారు. ఓ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకు దేశ ప్రధానమంత్రి కావడమే ఇందుకు నిదర్శనమని ఉదహరించారు.

English summary
Former Jammu and Kashmir Chief Minister Omar Abdullah today saw praise for Manmohan Singh in US President Barack Obama's comments on poverty alleviation in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X