వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతా యువతి యూ టర్న్: మమత 'చిన్నపిల్ల' క్షమాపణ చెప్పింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో మే 22వ తేదీన హిట్ అండ్ రన్ కేసులో కోల్‌కతా మేయర్ సోవాన్ ఛటర్జీ కోడలు దేబప్రియ ఛటర్జీ కేసులో కొత్త ట్విస్ట్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దేబప్రియ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ద్వారా ఆమె క్షమాపణలు చెప్పారు. ఆమె హిట్ అండ్ రన్ ఘటన పైన సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె తగ్గి, క్షమాపణలు చెప్పారు.

తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని, అది తన జీవితంలో చేదు సంఘటన అని ఆమె పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ సంఘటన పైన నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షమాపణ కోరుతున్నానన్నారు.

ఎవరినీ నొప్పించాలనేది తన ఉద్దేశ్యం కాదని చెప్పారు. అనుకోకుండా జరిగిన దుర్ఘటన పైన తాను ఏం మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. ఈ విషయంలో అధికారులు తమ విధులు నిర్వర్తించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరినీ తాను కోరుతున్నానని, ఈ అంశానికి ఇంతడితో ముగించాలని కోరారు. నేను మళ్లీ నా సాధారణ జీవితంలోకి వెళ్తానని చెప్పారు. కాగా, మేయర్ ఫోన్ చేయడంతో ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

 Hit-and-run controversy: 1 call from Kolkata mayor; niece takes U-turn, apologises

అసలేం జరిగింది?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఓ షాకింగ్ ఇటీవల స్టేట్‌మెంట్ ఇచ్చారు. కోల్‌కతా మేయర్ సోవాన్ చటర్జీ, అతని కుటుంబం మమతకు చాలా సన్నిహితులు. అయితే, మేయర్ కోడలు దేబప్రియ చటర్జీని ఓ కేసులో వెనుకేసుకు రావడం గమనార్హం.

కోల్‌కతాలో మే 22 హిట్ అండ్ రన్ కేసులో దేబప్రియ చటర్జీ కేసును ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన పైన మమత మాట్లాడుతూ... చిన్న పిల్లల వల్ల ఆ సంఘటన జరిగిందని, అలాంటప్పుడు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

మమతా బెనర్జీ 24 ఏళ్ల దేబప్రియను వెనుకేసుకొచ్చారు. దేబప్రియ కలకత్తా విశ్వవిద్యాలయం విద్యార్థిని. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేస్తోంది.

సమాచారం మేరకు.. ఆమె మే 22వ తేదీన నానో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించలేదు. అంతేకాదు, రోడ్డున వెళ్తున్న ఓ వ్యక్తిని గుద్దింది. నిలదీసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బెదిరించింది. తాను మేయర్ కోడలినని, నీ ఉద్యోగం ఊడగొడతానని హెచ్చరించింది. అంతేకాదు, అతని చేతి నుండి పాకెట్ పుస్తకం లాక్కుంది. దీనిపై పోలీసులు ఆమె పైన, ఆమె స్నేహితుల పైన కేసు నమోదు చేశారు.

ఆమె డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. అయితే, మంగళవారం మమతా బెనర్జీ మాత్రం ఆమెకు మద్దతు పలికారు. చిన్నపిల్ల పని అంటూ చెప్పడం గమనార్హం. అంతేకాదు, ట్రాఫిక్ పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు, దేబప్రియ చటర్జీ మాట్లాడుతూ.. తన పైన అనవసరంగా కేసు పెట్టారని చెప్పారు.

English summary
A week after the controversial accident in Kolkata, Debapriya Chatterjee finally apologised on Facebook. 24-year-old Debapriya made headlines following a hit-and-run case controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X