వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీ షాకింగ్ స్టేట్‌మెంట్: ఆ యువతి చిన్నపిల్లనట!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఓ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కోల్‌కతా మేయర్ సోవాన్ చటర్జీ, అతని కుటుంబం మమతకు చాలా సన్నిహితులు. అయితే, మేయర్ కోడలు దేబప్రియ చటర్జీని ఓ కేసులో వెనుకేసుకు రావడం గమనార్హం.

కోల్‌కతాలో నాలుగు రోజుల క్రితం (మే 22) హిట్ అండ్ రన్ కేసులో దేబప్రియ చటర్జీ కేసును ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన పైన మమత మాట్లాడుతూ... చిన్న పిల్లల వల్ల ఆ సంఘటన జరిగిందని, అలాంటప్పుడు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

మమతా బెనర్జీ 24 ఏళ్ల దేబప్రియను వెనుకేసుకొచ్చారు. దేబప్రియ కలకత్తా విశ్వవిద్యాలయం విద్యార్థిని. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేస్తోంది.

Mamata Banerjee

సమాచారం మేరకు.. ఆమె మే 22వ తేదీన నానో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించలేదు. అంతేకాదు, రోడ్డున వెళ్తున్న ఓ వ్యక్తిని గుద్దింది. నిలదీసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బెదిరించింది. తాను మేయర్ కోడలినని, నీ ఉద్యోగం ఊడగొడతానని హెచ్చరించింది. అంతేకాదు, అతని చేతి నుండి పాకెట్ పుస్తకం లాక్కుంది.

దీనిపై పోలీసులు ఆమె పైన, ఆమె స్నేహితుల పైన కేసు నమోదు చేశారు. ఆమె డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు.

అయితే, మంగళవారం మమతా బెనర్జీ మాత్రం ఆమెకు మద్దతు పలికారు. చిన్నపిల్ల పని అంటూ చెప్పడం గమనార్హం. అంతేకాదు, ట్రాఫిక్ పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు, దేబప్రియ చటర్జీ మాట్లాడుతూ.. తన పైన అనవసరంగా కేసు పెట్టారని చెప్పారు.

English summary
Here comes another shocking statement from our West Bengal Chief Minister -- Mamata Banerjee. It is a known fact that West Bengal Mayor Sovan Chatterjee and his family members are very close to the CM. But what she is doing to defend Mr Chatterjee's niece, Debapriya, is really disturbing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X