వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ట్వీట్ 69 ఏళ్లకు నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టింది..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఒక్క ట్వీట్ 69 ఏళ్లకు నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఉత్తరం ముక్క రాసుకునే సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి.. ఇన్నాళ్ల తర్వాత ఓ ట్వీట్ ద్వారా.. అవును ఒకే ఒక్క ట్వీట్ ద్వారా.. ఆ కల నెరవేరింది.. ఎలా సాధ్యమై ఉంటుంది..?

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి సమాచార విప్లవం పరుగులు పెడుతున్న నేటి తరుణంలోను.. ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ లాంటి కనీస సమాచార కేంద్రాలు లేని ఊళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. భారత్-చైనా సరిహద్దుకు 120 కిమీల దూరంలో ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ జిల్లాలో ఉన్న భరోలి అనే ఊరు కూడా ఇదే కోవలోకి వస్తుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లవతున్నా.. కనీస సమాచార వ్యవస్థగా భావించే పోస్ట్ ఆఫీస్ కూడా ఆ ఊళ్లో లేకపోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వస్తోంది. పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఆ ఊరికి బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువ.

పోస్ట్ ఆఫీస్ లేకపోవడం వల్ల సమాచారంలో జాప్యంతో ఆ ఊళ్లో ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పడి ఇప్పడు భనోలిలో ఓ తపాలా కార్యాలయం ఏర్పాటైంది.

అయితే ఇన్నాళ్లూ లేని ఆ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడెలా ఏర్పాటయిందంటే.. ఒక్కటే సమాధానం.. ఒకే ఒక్క ట్వీట్ వల్ల ఇది సాధ్యపడింది. భనోలిలో పోస్ట్ ఆఫీస్ లేని విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ట్విట్టర్ ద్వారా కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి తక్షణం భనోలిలో పోస్ట్ ఆఫీస్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవడంతో.. గ్రామంలోని ఓ తాత్కాలిక గదిలో పోస్ట్ ఆఫీస్ కార్యకలాపాలు మొదలయ్యాయి.

English summary
It may sound absurd but Bhanoli Sera did not have a post office even after 69 years of Independence. There have been numerous instances where residents of this far flung village had to lose job opportunities due to delay in communication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X