వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను వదిలేయండి, ఇక్కడే ఉంటాను.. పంపించకండి: ప్రియాంక

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాయ్‌బరేలీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ మొన్న తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం, నిన్న గురువారం నాడు తల్లి సోనియా కోసం వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండు రోజుల క్రితం అమేథీలో పర్యటించిన ప్రియాంక, ఆ తర్వాత రాయ్ బరేలీలో పర్యటించారు.

రాయ్ బరేలీ పర్యటనలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని ప్రియాంక గాంధీ చెప్పారు. సోనియాతో కలిసి రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న ప్రియాంకను స్థానిక కార్పొరేటర్‌ ధర్మేంద్ర ద్వివేది... క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరారు.

Priyanka Gandhi

దీనికి ప్రియాంక నవ్వుతూ.. నన్ను ఇక్కడే (రాయ్‌బరేలీ, అమేథీ) ఉండనివ్వండి, అక్కడికెందుకు (రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు) పంపించాలనుకుంటున్నారని అన్నారు. ఇందిర హావభావాలున్న ప్రియాంకను పార్టీలో కీలక స్థానాన్ని అప్పగిస్తే పార్టీకి అనుకూలిస్తుందని చాలామంది కాంగ్రెస్‌ నేతలు కోరారు. అప్పుడు కూడా దీన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు.

ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా రోజులుగా కోరుతున్నారు. కానీ ఆమె ఎప్పటికి అప్పుడు తిరస్కరిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇటీవలి వరకు విఫల నాయకుడిగా భావించారు. ఇటీవల దాదాపు రెండు నెలల సెలవుల అనంతరం రాహుల్లో కొత్త నాయకుడు కనిపిస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
"Humein yahin rehne do" (let me remain here), Priyanka Gandhi said in Rae Bareli on Thursday, virtually turning down local Congress leaders' request to join active politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X