వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రుడితో భార్యపై అత్యాచారం: భర్తకు పదేళ్ల జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Husband gets 10 yrs in jail for abetting rape of wife in Delhi
న్యూఢిల్లీ: తన భార్యపై మిత్రుడితో అత్యాచారం చేయించిన ఓ భర్తకు ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలి వాంగ్మూలం, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా అతనికి కోర్టు ఆ శిక్ష విధించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందనే వాదనను తోసిపుచ్చుతూ బాధితురాలి భర్తకు, అతని మిత్రుడికి అదనపు సెషన్స్ జడ్జి ఎంసి గుప్తా జైలు శిక్ష విధించారు.

బాధితురాలు సంఘటనను తెలియజేయడానికి వెనకాడినందున అత్యాచారం వంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరగడం సహజమని న్యాయమూర్తి వాదించారు. ప్రత్యేకంగా అత్యాచారం లేదా మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి సంఘటనల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరడం మామూలేనని న్యాయమూర్తి అన్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితురాలు లేదా వారి సంబంధీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని, అందువల్ల జాప్యం జరుగుతుందని అన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పలు కోణాల్లో ఆలోచనలు చేస్తారని, భారత్ వంటి సంప్రదాయాలకు కట్టుబడే దేశంలో ఆ అంశంపై కేసును కొట్టివేయడం కుదరదని అన్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని యావత్తూ పరిశీలిస్తే నిందితుడు నేర రచనలో పాల్గొన్నాడని అర్థమవుతుందని, ఆమె వాంగ్మూలం నమ్మదగిందిగా ఉందని న్యాయమూర్తి అన్నారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు, ఆమెను కొట్టినట్లు కూడా వైద్య పరీక్షలు తెలియజేస్తున్నాయని అన్నారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - తన పదహారేళ్ల కూతురు కనిపించడం లేదని 2011 ఏప్రిల్ 21వ తేదీన బాధితురాలి తండ్రి నారేలా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలికను, ఇద్దరు నిందితులను రైల్వే స్టేషన్ వద్ద పట్టుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

పెళ్లి చేసుకోవడానికి యువకుడితో తాను స్వచ్ఛందంగా వెళ్లిపోయానని బాలిక చెప్పింది. తన భర్త తనను అతని మిత్రుడి ఇంటికి పంపుతుండేవాడని, అక్కడ తనను నిర్బంధించి తనపై అత్యాచారం చేసి, కొట్టేవాడని ఆమె ఆరోపించింది. ఓ రోజు తాను అక్కడి నుంచి తప్పించుకుని తన బంధువుకి ఫోన్ చేశానని, ఆ బంధువు తన తండ్రికీ పోలీసులకూ సమాచారం ఇచ్చారని ఆమె వివరించింది.

English summary
A Delhi court has sentenced a man to 10 years in jail for abetting rape of his wife by his friend, while relying on the testimony of the victim and her medical report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X