వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కష్టాలొస్తాయని తెలుసు: జయలలిత, రజనీకాంత్ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్ పొందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

తన ప్రజాజీవితాన్ని నిప్పుల నదిలో ఈదడంతో పోల్చారు. ఇలాంటి కష్టాలు ఎదుర్కొనక తప్పదన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఎదుర్కొనాల్సి రావడంపై తాను బాధపడడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు.

జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ లేఖ రాశారు. ఆ లేఖలో జయకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జయ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా జయకు లేఖ రాశారు. కష్టాలు తొలిగి, మళ్లీ సీఎం పీఠంపై కూర్చోవాలని లేఖలో ఆకాంక్షించారు.

 జయలలిత

జయలలిత

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్ పొందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

 జయలలిత

జయలలిత

తన ప్రజాజీవితాన్ని నిప్పుల నదిలో ఈదడంతో పోల్చారు. ఇలాంటి కష్టాలు ఎదుర్కొనక తప్పదన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు.

 జయలలిత

జయలలిత

తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఎదుర్కొనాల్సి రావడంపై తాను బాధపడడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు.

 జయలలిత

జయలలిత

జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నానని, వాటిని విజయవంతంగా అధిగమించానని అన్నారు. తన కష్టాలను చూసి కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడరాదని సూచించారు.

 జయలలిత

జయలలిత

తనకోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలే తనను ఆదుకున్నాయని జయ తన ప్రకటనలో పేర్కొన్నారు.

 జయలలిత

జయలలిత

తన కోసం మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.3 లక్షలు, ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురికి రూ.50వేల చొప్పున సాయం ఇవ్వనున్నారు.

English summary
I never bothered about the obstacles and the challenges. I will face them with will power and defeat them, said ADMK general secretary Jayalalitha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X