వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదిహేనుళ్లుగా ఎన్నికల్లో పోటీచేసేందుకే వేచి చూశాను, వారసులకు టిక్కెట్లు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను 15 ఏళ్ళపాటు వేచిచూడాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను 15 ఏళ్ళపాటు వేచిచూడాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో పలువురు పార్టీ నాయకుల వారసులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ దఫా వారసులు బరిలోకి దిగుతున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తనయుడికి ఈ దఫా నోయిడా నుండి అసెంబ్లీ టిక్కెట్టు దక్కింది.గత ఎన్నికల్లో ఆయన పంకజ్ కు టిక్కెట్టు ఇవ్వాలని కోరినా పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోవడంపై మనస్థాపానికి గురయ్యారనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ దఫా పంకజ్ కు బిజెపి టిక్కెట్టు దక్కింది.దీంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తొలిసారిగా టిక్కెట్టు దక్కడంతో ఆయన తన మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తున్నారు.

 15 ఏళ్ళుగా ఎదురుచూశా

15 ఏళ్ళుగా ఎదురుచూశా

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకుగాను తాను 15 ఏళ్ళపాటు ఎదురుచూశానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకుగాను 15 ఏళ్ళపాటు తాను క్షేత్రస్థాయిలో కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.ఎన్నికల్లో ఎవరూ పోటీచేయాలనేది తమ పార్టీ నాయకత్వం నిర్ణయిస్తోందన్నారు. తాను సామాన్యకార్యకర్తనేనని చెబుతున్నారు పంకజ్ సింగ్.

 బిజెపి రెండో జాబితాలో పంకజ్ కు దక్కిన చోటు

బిజెపి రెండో జాబితాలో పంకజ్ కు దక్కిన చోటు


ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బిజెపి విడుదల చేసింది. బిజెపి రెండు జాబితాలను ప్రకటించింది. తొలి జాబితాలో పంకజ్ కు చోటు దక్కలేదు . కాని, రెండో జాబితాలో పంకజ్ కు చోటు దక్కింది.155 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాతో బిజెపి రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ కు చోటు దక్కింది.బిజెపి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పంకజ్ సింగ్ పనిచేస్తున్నారు.

 పంకజ్ కు టిక్కెట్టు ఇవ్వనందుకు ఆయనకు కోపం లేదు

పంకజ్ కు టిక్కెట్టు ఇవ్వనందుకు ఆయనకు కోపం లేదు

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ కు గత ఎన్నికల్లో టిక్కెట్టు దక్కనందుకుగాను ఆయన మనస్థాపానికి గురయ్యారనే వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.బిజెపి సీనియర్ నాయకుడు లాల్జీటాండన్ తనయుడు గోపాల్ కు ఈ దఫా టిక్కెట్టు దక్కింది.అయితే పార్టీ సీనియర్ల కొడుకులకు టిక్కెట్లు కేటాయించడాన్ని ఆ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ఇంచార్జ్ ఓం మాధుర్ సమర్థించుకొన్నారు.

 పంకజ్ పోటీచేసేందుకు అర్హుడు

పంకజ్ పోటీచేసేందుకు అర్హుడు

నోయిడా నుండి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ కు టిక్కెట్టు కేటాయించడాన్ని ఆ పార్టీ యూపి వ్యవహరాల ఇంచార్జ్ ఓమ్ మాథుర్ సమర్థించారు.15 ఏళ్ళగా పంకజ్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు.టిక్కెట్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఆయనకు టిక్కెట్టుఇవ్వడంలో తప్పులేదన్నారు మాథుర్ .లాల్జీటాండన్ తనయుడు ఇప్పటికే యూపి విధానసభలో అడుగుపెట్టారు.మరోసారి ఆయనకు టిక్కెట్టు దక్కింది.

English summary
i have been working as a party worker for last 15 years says pankaj singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X