వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్షిలా ఎగరాలనుకున్నా: ఐదో క్లాస్‌లో కలామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ తన చిన్ననాటి విషయాలను చాలా ఆసక్తికరంగా చెప్పేవారు. విద్యార్థులకు స్పూర్తి ప్రదాతగా ఆయన నిలిచారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పిల్లలకు అంత దగ్గరగా వెళ్లింది భారతదేశంలో కలామ్ మాత్రమేనంటే అతిశయోక్తి కాదేమో.

తాను ఎగరాలని అనుకున్నట్లు డాక్టర్ అబ్దుల్ కలామ్ చెప్పారు. అది కూడా ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు. "నేను 1941లో ఐదో తరగతి చదువుతున్నాను. సైన్స్ టీచర్ సుబ్రమణ్యం తరగతి గదిలోకి వచ్చారు. ఆయన జీవితంలో పవిత్రతను, విజ్ఞానాన్ని తరగతి గదిలోకి తెచ్చారు" అని కలామ్ ఒక సందర్బంలో బాల్య జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

APJ Abdul Kalam

"ఆయన ఎగురుతున్న పక్షి బొమ్మను గీశారు. అది ఎలా ఎగురుతుందో వివరించారు. ఆ రోజు పక్షి ఎలా ఎగురుతుందో తెలుసుకోవడమే కాకుండా నా జీవిత లక్ష్యాన్ని మార్చింది. నేను ఎగరాలని అనుకున్నాను" అని ఆయన వివరించారు.

కల నెరవేరింది....

"నేను పైలట్‌ను కావాలని అనుకున్నాను. నాకు పదో స్థానం వచ్చింది. అక్కడ తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో పరీక్ష రాయలేకపోయాను. కొన్ని సార్లు నువ్వు ఏం కోరుకుంటావో అది లభించదు" అని చెప్పారు. "2002లో నన్ను భారతీయ నాయకులు రాష్ట్రపతివి కా అన్నారు. నేను ఒకె చెప్పాను" అని ఆయన వివరించారు.

2005లో ఎయిర్ స్టాఫ్ చీప్ తన వద్దకు వచ్చాడని, పైలట్ కావాలనే కోరిక తాను తీర్చుకోలేకపోయానని చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. "శిక్షణ తీసుకోవాలని ఎయిర్ చీఫ్ చెప్పారు. చివరకు 2007లో 30 నిమిషాల పాటు ఎగిరాను" అని ఆయన వివరించారు.

సందేశం ఏమిటంటే, "నువ్వు కలలు కంటే, జీవితంలో లక్ష్యం ఉంటే, విజ్ఞానాన్ని పొంది, తెలుసుకుంటే, కఠిన శ్రమ చేస్తే సమస్యను ఎదుర్కుని విజయం సాధిస్తావు" అని అబ్దుల్ కలామ్ చెప్పారు.

English summary
I wanted to fly, Dr Abdul Kalam the former President of India had said. The people’s president had said that it was the year 1941 and he was in Class V. Whenever my science teacher Subramanium entered the class he radiated knowledge and purity of life. One day he drew a sketch of a flying bird and explained how bird flies. 'That day I not only learned how birds fly but my aim in life changed- I wanted to fly.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X