వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి కొడుకుల మద్య సవాల్ : అఖిలేష్ పై పోటీకి సిద్దం, బిజెపితో అఖిలేష్ చెట్టాపట్టాల్

తాను అఖిలేష్ పై పోటీచేస్తానని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. గుర్తుపై ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకొన్నా తాను శిరసావహిస్తానని ఆయన ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్టంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ లో సంక్షోభం తారాస్థాయికి చేరుకొన్నట్టుగా కన్పిస్తోంది. తనయుడిపై తానే పోటీకి దిగుతానని ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ముస్లింలను అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించాడు.బిజెపితో అఖిలేష్ చేతులు కలిపాడని ాయన ఆరోపించాడు.

సమాజ్ వాదీ పార్టీ లో సంక్షోభ పరిస్థితులు తీవ్రమయ్యాయి. పార్టీలో అఖిలేష్ యాదవ్ పై చేయి సాధించాడు.అమర్ సింగ్ చికిత్స కోసం లండన్ తిరిగి వెళ్తున్నాడు. ఎన్నికలు పూర్తయ్యాకే ఆయన ఇండియాకు తిరిగి వస్తాడు.

పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తన డిమాండ్లను తండ్రికి విన్పించాడు అఖిలేష్ యాదవ్ .అయితే ఇరు వర్గాల మద్య రాజీ మాత్రం కుదరలేదు. ఈ పరిస్థితులు పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 అఖిలేష్ పైనే పోటీచేస్తానన్న ములాయంసింగ్

అఖిలేష్ పైనే పోటీచేస్తానన్న ములాయంసింగ్

తనయుడు అఖిలేష్ యాదవ్ పై పోటీకి తాను సిద్దంగా ఉన్నానని ములాయంసింగ్ యాదవ్ ప్రకటించారు. తన సన్నిహితులతో, ములాయం సింగ్ యాదవ్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.అవసరమైతే తానే అఖిలేష్ పై పోటీకి దిగుతానని ప్రకటించారు. ఎన్నికల గుర్తు సైకిల్ తనకే దక్కేలా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్టు ప్రకటించారు ములాయం సింగ్ యాదవ్.

గుర్తుపై ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకొన్న శిరసావహిస్తా

గుర్తుపై ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకొన్న శిరసావహిస్తా


గుర్తుపై ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని శిరసవహిస్తా
ఎన్నికల గుర్తుపై ఇరువర్గాల వాదనలను ఎన్నికల కమీషన్ విన్నది. అయితే రెండు వర్గాలను సపోర్ట్ చేసే నాయకుల అఫిడవిట్లను కూడ రెండు వర్గాల నాయకులుపోటాపోటీగా ఎన్నికల కమీషన్ ను సమర్పించారు. గుర్తు విషయంలోఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకొన్నా తనకు శిరోధార్యమేనని ఆయన ప్రకటించారు.

 అఖిలేష్ నాతో చర్చించలేదు

అఖిలేష్ నాతో చర్చించలేదు

పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకుగాను ముఖ్యమంత్రి అఖిలేష్ ను మూడు దఫాలు పిలిపించానని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. అయితే మూడు దపాలు కూడ ఒక్క నిమిషం పాటే తన వద్ద అఖిలేష్ ఉన్నారని ఆయన గుర్తుచేశాడు. తాను మాట్లాడే సమయానికే అఖిలేష్ అక్కడి నుండి వెళ్ళిపోయారని ములాయం సింగ్ ప్రకటించారు. పార్టీ సమస్యలపై చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు.

 ప్రత్యర్థులతో అఖిలేష్ చేతులు కలిపాడు

ప్రత్యర్థులతో అఖిలేష్ చేతులు కలిపాడు

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బిజెపితో పాటు ఇతర ప్రతిపక్షాలతో అఖిలేష్ యాదవ్ చేతులు కలిపాడని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆరోపించాడు.ఈ విషయమై తాను అఖిలేష్ కు నచ్చచెప్పందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే అఖిలేష్ వినడం లేదని ములాయం సింగ్ ఆరోపించాడు.తన తప్పులను అఖిలేష్ తెలుసుకోవడం లేదని ములాయం సింగ్ ఆరోపించాడు.

 అఖిలేష్ ను దెబ్బకొట్టేందుకు ములాయం వ్యూహం

అఖిలేష్ ను దెబ్బకొట్టేందుకు ములాయం వ్యూహం

కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్ ఎల్ డి ఇత పార్టీలతో కలిసి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాలని అఖిలేస్ భావిస్తున్నాడు.అయితే అఖిలేష్ ను దెబ్బకొట్టేందుకుగాను ములాయం వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాడు.సమాజ్ వాదీ పార్టీవైపు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయితే బిజెపితో అఖిలేష్ చేతులు కలిపాడని ములాయం సింగ్ ఆరోపించాడు. ఈ ఆరోపణల ద్వారా వైపుకు ముస్లిం ఓటర్లు మొగ్గుచూపకుండా ఉండేందుకుగాను ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ పై ఆరోపణలు చేశాడు.

English summary
i will contest on akhilesh yadav announced mulayam singh. akhilesh alliance bjp and other parties said mulayam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X