వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కత్తా: సన్యాసి అవుతానన్న మోడీ అభ్యర్ధనను తిరస్కరించిన స్వామిజీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: వచ్చే శనివారం ప్రధాని మోడీ కోల్‌కత్తాలో ఒకరోజు పర్యటించనున్నారు. బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న 97 ఏళ్ల ఆత్మస్థానంద్ మహారాజ్ గత కొద్దికాలంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్న ఆయన్ని ప్రధాని మోడీ కలవనున్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్ నందా మహారాజ్ మాట్లాడుతూ.. 'మోడీజీ ఆత్మస్థానంద్ మహారాజ్‌ను గురువుగారిగా భావిస్తారు. ఎప్పటి నుంచో ఆయనను కలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు స్వామీజీకి వయసు అడవడంతో గత కొంతకాలంగా

ఆసుపత్రిలో ఉంటున్నారు. రాజ్‌కోట్‌లో కలిసి ఉన్నప్పుడు ఆత్మస్థానంద్ మహారాజ్ గారి సలహాలు మోడీ తీసుకునేవారు' అని చెప్పారు.

In Kolkata, PM Modi Will Meet 97-Year-Old Swami Who Rejected Him for Monk

ప్రధాని మోడీ తన గురువు గారిని చివరిసారిగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించి మోడీ ప్రధాని అయ్యాక తమ ఆశ్రమానికి రావాల్సిందిగా బేలూర్ మఠం నుంచి మోడీకి లేఖ రాశారు.

యుక్తవయసులో నాడు సన్యాసిగా చేరేందుకు వచ్చిన నువ్వు నేడు భారత ప్రధానిగా మఠంలోకి వస్తుంటే చూడాలని ఉందని ఆయన ఆ లేఖలో రాశారు. ప్రధానిని నరేంద్ర భాయ్‌గా సంబోదిస్తూ రాసిన లెటర్‌లో అత్యధిక మెజారిటీ నువ్వ గెలవడం సంతోషంగా ఉందని రాశారు.

సన్యాసిగా చేరేందుకు వచ్చిన ప్రధాని మోడీని, సన్యాసిగా ఉండిపోతానంటే అందుకు అంగీకరించకుండా.. నువ్వు ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడివని, భారత రాజకీయాల్లోకి ప్రవేశించాలని స్వామీ ఆత్మస్థానంద్ మహారాజ్ ఉపదేశించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో బీజీగా

ఉన్న ప్రధాని మోడీ కాస్తం తీరిక తీసుకుని శనివారం బేలూరు మఠానికి వెళ్లనున్నారు.

1897లో రామకృష్ణ మఠాన్ని స్వామి వివేకానంద స్ధాపించారు. ప్రధాని నరేంద్ర మోడీ వివేకానందుని ఆదర్శాలు, బోధనలు తనకు ప్రేరణగా నిలిచాయని తరుచూ ప్రసంగాల్లో చెబుతుంటారు.

English summary
Next Saturday, when Prime Minister Narendra Modi is in Kolkata for a day, he will visit Swami Atmasthanand Maharaj, the 97-year-old head of the Ramakrishna Math and Mission Order, who has been unwell for a while.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X