వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ ఇంట్లో రూ.10 కోట్లు.. 10 కేజీల గోల్డ్!

నోయిడాలో ఓ ఐఏఎస్ అధికారికి చెందిన ఇళ్లపై అదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి రూ.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఐఏఎస్ అధికారికి చెందిన ఇళ్లపై అదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి.. భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

నోయిడాలోని ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేశవ్ లాల్ ఇళ్లపై గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

Income-Tax dept seizes Rs 10 cr, 10 kg gold in Noida raid on Additional Sales Tax Commissioner

కేశవ్ లాల్ కాన్పూర్ పరిధిలో అమ్మకం పన్ను విభాగంలో అదనపు కమిషనర్ గా పని చేస్తున్నారు. గతంలో నోయిడా ప్రాధికార సంస్థ ఓఎస్డీగా కూడా పని చేశారు. గురువారం ఈయనకు చెందిన ఇళ్లపై దాడులు చేసిన అదాయపన్ను శాఖ అధికారులు రూ.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం, కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారుల ఇళ్లల్లో అదాయపన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మరికొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

English summary
The Income-Tax department has seized as much as Rs 10 crore along with 8 kg gold on Thursday morning according to the reports by Times Now. The raid was conducted at the house of an Additional Sales Tax Commissioner and jewellery was seized from the house as well. The TV channel claimed that over Rs 10 crore has been seized in cash by the I-T department from the house of Noida-based Additional Sales Tax Commissioner Keshav Lal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X