వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచే యోచన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణులైన ఉద్యోగులకు ప్రస్తుతం మూడు నెలలు ప్రసూతి సెలవు ఇస్తున్నారు.

దీనిని 8 నెలలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ దిశగా ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961ను సవరించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోందని ఓ అధికారి తెలిపారు. కాన్పు అంచనా తేదికి ముందు నెల, కాన్పు తర్వాత ఏడు నెలల పాటు మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది.

Increase maternity leave from 3 months to 8 months: Maneka Gandhi

దీనిపై పీఎంఓ సూచనాప్రాయంగా ఆమోదం తెలపడంతో ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా కార్మిక శాఖ ఇప్పటిదాకా ఉన్న చట్టానికి సవరణలు చేసేందుకు రంగంలోకి దిగింది. ‘‘ప్రసూతి సెలవు పెంపు ప్రతిపాదనను కేబినెట్ సెక్రటేరియట్ కు పంపాం. ప్రధాని నరేంద్ర దృష్టికీ తీసుకెళ్లాం. ఆయన ఎంతో సానుకూలత చూపారు. అందుకే ఆయనకూ ఈ ప్రతిపాదన ప్రతిని పంపుతున్నాం'' అని బిశ్వాస్ చెప్పారు.

కేంద్రం నుంచి దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకనుగుణంగా ఈ సెలవును 8 నెలలకు పెంచుతారు.

English summary
Women and child development (WCD) minister Maneka Gandhi wants the three-month maternity leave presently granted to working women under the Maternity Benefits Act, 1961, to be increased to eight months, so as to enable mothers to take better care of their newborns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X