వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మరో అడుగు... చైనాకు భారీ షాక్! ‘టెంపర్’ తగ్గించేందుకే...

ఇటీవల భారత్‌పై తరచూ విరుచుకుపడుతున్న చైనాకు భారత్ దిమ్మదిరిగే షాకిచ్చింది. ఆ దేశం నుంచి గత ఐదేళ్లుగా పెద్దమొత్తంలో దిగుమతి అవుతున్న టెంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి సుంకాన్నివిధించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల భారత్‌పై తరచూ విరుచుకుపడుతున్న చైనాకు భారత్ దిమ్మదిరిగే షాకిచ్చింది. ఆ దేశం నుంచి గత ఐదేళ్లుగా పెద్దమొత్తంలో దిగుమతి అవుతున్న టెంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి సుంకాన్నివిధించింది.

స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లను రక్షించేందుకు వీటిని ఉపయోగిస్తారు. తాజాగా రెవెన్యూ విభాగం నోటిఫికేషన్ విడుదల చేస్తూ భారత్‌లోకి దిగుమతి అయ్యే టన్ను టెంపర్డ్ గ్లాస్‌లకు 52.85 నుంచి 136.21 అమెరికన్ డాలర్ల సుంకాన్ని విధించనున్నట్టు పేర్కొంది.

india-china-flags

90.5 శాతం పారదర్శకత కలిగి, 4.2 ఎంఎం మందం మించకుండా ఉన్న టెక్స్చర్డ్ టఫెన్డ్ (టెంపర్డ్) గ్లాసులపై ఈ సుంకం విధిస్తున్నట్టు పేర్కొంది. సాధారణ విలువతో చైనా ఈ గ్లాసులను భారత్‌కు ఎగుమతి చేస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ-డంపింగ్ అండ్ అలైడ్ డ్యూటీస్ (డీజీఏడీ) దర్యాప్తులో తేలింది. వీటి వల్ల దేశీయ పరిశ్రమలకు తీవ్రంగా నష్టపోతున్నట్టు డీజీఏడీ పేర్కొంది.

ఈ ఆదేశాలు నేటి నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయని రెవెన్యూ విభాగం పేర్కొంది. దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు మోడీ ప్రభుత్వం ఈ దిగుమతి సుకం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

English summary
India has imposed an anti-dumping duty on tempered glass, used for protecting mobile phone screens, from China for five years to protect the domestic industry from below-cost imports. Investigations by the directorate general of anti-dumping and allied duties (DGAD) had found that the tempered glass has been exported to India from China below its associated normal value. Also, it concluded that domestic industry has suffered material injury, which was caused by the dumped imports of the goods from China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X