వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ భారత్.. సైనిక వ్యయంలో ఐదోస్థానం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ రంగానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. 2016లో దేశ రక్షణ కోసం భారత సైనిక వ్యయం 8.5 శాతం పెరుగుదలతో 55.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (సిప్రీ) సోమవారం ప్రకటించింది.

అంతే కాదు భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 6 శాతం పెరుగుదలతో రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో రక్షణ రంగ ఆధునీకరణకే రూ.86,488 కోట్లు కేటాయించింది. భారతదేశం పొరుగుదేశం చైనా రక్షణ రంగ విస్తరణకు నిధులు పెంచుతున్న నేపథ్యంలో భారత్ రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పొడచూపుతుందని భావిస్తున్నారు.

2011 తర్వాత అంతర్జాతీయంగా మిలటరీ వ్యయం 2016లో వరుసగా రెండో సంవత్సరం 1686 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని సిప్రీ అధ్యయన సారాంశం. 2011లో తొలిసారి మిలిటరీ వ్యయం అనూహ్య రీతిలో 1699 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వాస్తవ అంచనాల ప్రకారం 2015తో పోలిస్తే 2016లో అంతర్జాతీయ రక్షణ రంగం బడ్జెట్ 0.4 శాతం మాత్రం పెరిగింది.

భారత్ అమ్ముల పొదిలోకి రాఫెల్ తదితర యుద్ధ విమానాలు

భారత్ అమ్ముల పొదిలోకి రాఫెల్ తదితర యుద్ధ విమానాలు

2014 నుంచి భారత్ రక్షణ వ్యయం క్రమంగా 10 శాతం పెరుగుతూ వస్తున్నది. రాఫెల్ యుద్ధ విమానాలు, అపాచీ, చినూక్, కామోవ్ హెలికాప్టర్లు, ఎం - 777 హోవిట్జర్ వంటి తేలికపాటి విమానాలను తమ అమ్ముల పొదిలో చేర్చుకుని బలోపేతం కావాలని భారత సైనిక బలగాలు ఆకాంక్షిస్తున్నాయి.

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డ అమెరికా

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డ అమెరికా

అంతర్జాతీయంగా సైనిక వ్యయంలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. 2016లో అమెరికా సైనిక వ్యయం 1.7 శాతం పెరుగుదలతో 611 బిలియన్ డాలర్లకు చేరింది. 2010లో చేసిన వ్యయంతో పోలిస్తే 2016లో అమెరికా సైనిక వ్యయం 20 శాతం తక్కువగానే ఉండటం గమనార్హం. గతంతో పోలిస్తే అమెరికా రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించే ధోరణికి చరమ గీతం పాడినట్లేనని నివేదిక పేర్కొన్నది. ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతోపాటు ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాల్లో నుంచి సైన్యాలను ఉపసంహరించడంతో మున్ముందు అమెరికా రక్షణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉన్నదని సిప్రీ ఆర్మీ అండ్ మిలిటరీ ఎక్స్ పెండిచర్ (అమెక్స్) ప్రోగ్రాం డైరెక్టర్ అడె ఫ్లైరెంట్ వ్యాఖ్యానించారు.

భారీగా తగ్గిన ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్

భారీగా తగ్గిన ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్

యావత్ ప్రపంచ దేశాల జీడీపీలో సైనిక వ్యయం వరుసగా రెండో ఏడాది 1,686 బిలియన్ డాలర్లకు (2.2 శాతం) చేరుకున్నది. టాప్ - 15 దేశాల సైనిక వ్యయం 1,360 బిలియన్ డాలర్లు కాగా, ఇది ప్రపంచ వ్యాప్త సైనిక వ్యయంలో 81 శాతం. 2016లో చైనా సైనిక వ్యయం 5.4 శాతం పెరిగి 215 బిలియన డాలర్లకు చేరింది. కానీ వివిధ దేశాల్లో ఇటీవలి కాలంలో రక్షణ రంగ బడ్జెట్ భారీగా తగ్గుముఖం పట్టిందని సిప్రీ నివేదిక పేర్కొన్నది.

రష్యా సాకుతో బడ్జెట్ పెంచుకున్న మధ్య యూరప్ దేశాలు

రష్యా సాకుతో బడ్జెట్ పెంచుకున్న మధ్య యూరప్ దేశాలు

కాగా రష్యా తన సైనిక వ్యయాన్ని 5.9 శాతం పెంచడంతో 69.5 బిలియన్ డాలర్లతో మూడోస్థానానికి చేరుకున్నది. గతంతో పోలిస్తే వివిధ దేశాల సైనిక వ్యయం చాలా తగ్గిందని సిప్రీ వ్యాఖ్యానించింది. రష్యా నుంచి ముప్పు ఉన్నదన్న పేరుతో మధ్య యూరప్ దేశాలు కూడా తమ రక్షణ బడ్జెట్‌ను పెంచేశాయి.

చమురు నిక్షేపాలు గల దేశాల బడ్జెట్ తగ్గుముఖం

చమురు నిక్షేపాలు గల దేశాల బడ్జెట్ తగ్గుముఖం

2015లో మూడోస్థానంలో ఉన్న సౌదీ అరేబియా తన సైనిక వ్యయంలో 30 శాతం కోత విధించింది. అరబ్ దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో సౌదీ పాల్గొంటున్నా గత ఏడాది 63.7 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేసిందని సిప్రీ నివేదిక వివరించింది. 2016 రక్షణ రంగ వ్యయంలో నాలుగో స్థానానికి చేరుకున్నది. ముడి చమురు నిక్షేపాలు గల అరబ్ దేశాల్లో రక్షణ బడ్జెట్ భారీగా తగ్గిపోవడానికి ఆయిల్ ఆధారిత ఆదాయం పడిపోవడమే కారణం. దీనికి ఇతర ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయి.

ఆసియా, పసిఫిక్ ఖండాల్లో పెరిగిన బడ్జెట్

ఆసియా, పసిఫిక్ ఖండాల్లో పెరిగిన బడ్జెట్

ఇక పాకిస్థాన్ పాక్ 9.93 బిలియన్ డాలర్లు మాత్రమే గతేడాది ఖర్చు చేసిందని సిప్రీ తెలిపింది. ఆసియా, పసిఫిక్ ఖండాల దేశాలు, తూర్పు, మధ్య యూరప్, ఉత్తరాఫ్రికా దేశాల్లో సైనిక వ్యయం పెరుగుతుంటే, మధ్య అమెరికా, కరేబియన్, మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, సహారా ఆఫ్రికా దేశాల్లో తగ్గుతున్నది. 2010 తర్వాత వరుసగా రెండో ఏడాది పశ్చిమ యూరప్ దేశాల్లో రక్షణ రంగ వ్యయం క్రమంగా పెరిగింది. మరోవైపు ఉత్తర అమెరికాలో తొలిసారి మిలిటరీ బడ్జెట్ పెంచారు. 2016లో పశ్చిమ యూరప్ దేశాల్లో రక్షణ బడ్జెట్ 2.6 శాతం పెరిగితే.. కేవలం ఇటలీలోనే 11 శాతం ఎక్కువగా నమోదైంది.

English summary
New Delhi’s military expenditure grew by 8.5% last year to $55.9 billion, according to the Stockholm International Peace Research Institute’s annual report on defence spending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X