వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-నరేంద్ర మోడీ: హానీమూన్ కొనసాగుతోంది!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ముప్పై ఏళ్లుగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగాయి. ఆ రికార్డు మోడీ హవాలో తుడిచి పెట్టుకుపోయింది. బీజేపీ మేజిక్ ఫిగర్ దాటింది.

ఎన్డీయే కూటని అనూహ్యంగా 330కు పైగా సీట్లు గెలుచుకుంది. 2014లో మోడీ హవా నడిచింది. ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. అయినప్పటికీ మోడీ హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉందని అంటున్నారు.

మోడీ అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో భారత్ పాత్ర మరింత పెరిగిందని చెబుతున్నారు. అయితే, దేశంలో ఇటీవల కనిపించిన 'అసహనం' తప్పితే మోడీ రికార్డ్ బాగుందని చెబుతున్నారు. ఆ అసహనం కూడా విపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించినవేననే వాదనలు ఉన్నాయి.

పాక్‌కు బుద్ధి వచ్చేలా మోడీ ఏం చేయట్లేదు, కానీ!పాక్‌కు బుద్ధి వచ్చేలా మోడీ ఏం చేయట్లేదు, కానీ!

మోడీ రెండేళ్ల పాలన పైన ప్యూ అనే అమెరికన్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోడీ హవా ఇంకా తగ్గలేదని తేలింది. భారత్‌ను మోడీ సరైన దిశలో నడిపిస్తున్నారని, ఆర్థిక పరిస్థితి మెరుగువుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

2013-14లలో నరేంద్ర మోడీకి అనుకూలంగా 78 శాతం మంది ఉండగా ఇప్పుడు 87 శాతానికి పెరిగింది. ఆర్థిక పరిస్థితి బాగుందని 74 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల క్రితం కంటే ఇది పదిహేడు శాతం ఎక్కవ. దేశాన్ని సరైన దిశలోనే నడిపిస్తున్నారని 56 శాతం మంది నమ్ముతున్నారు.

దేశాన్ని నడిపించే నేతగా తొలి ఛాయిస్ మోడీయేనని 81 శాతం మంది, సెకండ్ ఆప్షన్‌గా సోనియా (65 శాతం), ఆపై రాహుల్ గాంధీ (63 శాతం మంది), అరవింద్ కేజ్రీవాల్(50)ని సర్వేలో పాల్గొన్న వారు ఎంచుకున్నారని వెల్లడించింది.

పార్టీ పరంగా చూస్తే బీజేపీకి ఫేవర్‌గా 80 శాతం మంది, కాంగ్రెస్‌కు 67 శాతం మంది, ఏఏపీకి 47 శాతం మంది మొగ్గు చూపారు.

 India and Modi: The Honeymoon Continues

మోడీ హయాంలో పేదవారికి సహాయం అందుతోందని 62 శాతం మంది, నిరుద్యోగంపై దృష్టి సారించారని 62 శాతం మంది, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారని 61 శాతం మంది చెప్పారు.

మోడీ తాను నమ్మిన సిద్ధాంతాల మీద నడుస్తున్నారని 62 శాతం మంది, కాంగ్రెస్ నడిచిందని 40 శాతం మంది, మోడీ అందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చారని 61 శాతం మంది, కాంగ్రెస్ తీసుకు వచ్చిందని 39 శాతం మంది, మోడీ అన్నింటిని నెరవేర్చగలరని 61 శాతం మంది, కాంగ్రెస్ వైపు 41 శాతం మంది మొగ్గు చూపారు.

భారత ఆర్థిక వ్యవస్థ పైన కేంద్రం వెరీ సీరియస్‌గా ఉందని 45 శాతం మంది, ఫర్వాలేదని 25 శాతం మంది, పాకిస్తాన్‌తో సంబంధాలపై చాలా సీరియస్‌గా ఉందని 48 శాతం మంది, పరవాలేదని 21 శాతం మంది, మిలటరీ పవర్ పెరుగుతోందని 46 శాదతం మంది, పరవాలేదని 23 శాతం మంది చెప్పారు.

English summary
Indians remain upbeat about Modi and see India playing larger role in the world, but growing partisan take on Modi’s record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X