వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగే సూచనల్లేవు'

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం స్పందించారు.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నప్పటికీ అవి యుద్ధానికి దారితీస్తాయని తాను భావించడం లేదని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. యుద్ధం జరగకూడదని రెండు దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తపడుతున్నాయన్నారు.

 Omar Abdullah

కాశ్మీర్‌లో జరుగుతున్న ఆందోళనలకు ముగింపు కనుచూపు మేరలో కనబడట్లేదన్నారు. ఇదే కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్యన్‌ స్వామి కూడా పాల్గొన్నారు. భారత్‌లో పాక్‌ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండుకు మద్దతు పలికారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం జరిగే సూచనలను కొట్టిపారేయలేమన్నారు.

యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం స్పందించారు.

English summary
Former Jammu and Kashmir Chief Minister Omar Abdullah does not see an imminent war looming between India and Pakistan despite the heightened tensions along the LoC and believes the two countries are a “lot more careful” about the prospect of war than some of the news channels would like them to be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X