హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాయం చేశారు: మోడీపై మరోసారి మన్మోహన్ ఆగ్రహం

రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంటులో కేంద్రం తీరును దుయ్యబట్టిన విషయం తెలిసిందే. తాజాగా నోట్ల ర‌ద్దుపై రాసిన ఓ వ్యాసాన్ని 'ద హిందూ' ఆంగ్ల ప‌త్రిక ప్ర‌చురించింది.

అందులో ఆయ‌న‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని అతిపెద్ద విషాదంగా పేర్కొంటూ ప్ర‌ధాని మోడీ చ‌ర్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఎన్నో న‌ష్టాలు ఉన్నాయ‌ని, జీడీపీ దెబ్బ‌తింటుంద‌ని, ఉద్యోగాల క‌ల్ప‌న త‌గ్గుతుంద‌న్నారు.

ఏటీఎంలపై సర్వే: హైదరాబాదులో షాకింగ్, బెజవాడ కొంచెం బెటర్ఏటీఎంలపై సర్వే: హైదరాబాదులో షాకింగ్, బెజవాడ కొంచెం బెటర్

భ‌విష్య‌త్తులో ఎన్నో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌న్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం భార‌తీయ వ్య‌క్తి విశ్వ‌స‌నీయ‌త‌కు తీవ్ర‌మైన గాయాన్ని చేసింద‌న్నారు. న‌ల్ల‌కుబేరులకు అతి త‌క్కువ న‌ష్టం మాత్ర‌మే క‌లుగుతోంద‌న్నారు.

manmohan singh

నిర్ణయం మంచిదే అయినా అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సామాన్యులు, పేదల కష్టాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయం, అసంఘటిత రంగాలు, చిన్న పరిశ్రమలు చాలా నష్టపోయాయని చెప్పారు.

నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు పోవచ్చు! వీటికే పెద్ద దెబ్బనోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు పోవచ్చు! వీటికే పెద్ద దెబ్బ

రోజుకో నిర్ణయం తీసుకుంటున్న బ్యాంకింగ్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం నిజాయితీగా పని చేసి నగదు రూపంలో కష్టార్జితం అందుకునే సగటు పౌరుడిని తీవ్రంగా గాయపరుస్తుందన్నారు. కపటబుద్ధితో నల్లధనం కూడబెట్టుకునే వారు జారుకుంటారన్నారు.

డబ్బు అనే ఆలోచన మనిషిలో భరోసా పెంచుతుందన్నారు. నవంబర్ 8వ తేదీన రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో వంద కోట్ల మందికి పైగా భారతీయుల భరోసా పటాపంచలైందన్నారు. చెలామణిలో ఉన్న 85 శాతం కరెన్సీ ఇప్పుడు చిత్తుకాగితాలతో సమానం అని ప్రధాని మోడీ ప్రకటించారని, ఇదిలక్షలాది మంది ప్రజల నమ్మకం ఒక అనాలోచిత నిర్ణయంతో వమ్ము అయిందన్నారు.

English summary
India should brace for tough period due to demonetisation, says Manmohan Singh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X