వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2030లో ఏళ్ల తర్వాత భారత్ ఎలా ఉంటుందంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2030 నాటికి భారత్ అన్ని రంగాల్లోను ముందంజలో ఉంటుందని, ప్రతి కేటగిరీలోను లీడ్ చేసే స్థాయిలో ఉంటుందని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యే విషయమై ప్రజలు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.

తాను భావి భారత్‌ను చూస్తున్నానని, కేవలం 2030నే చూస్తున్నానని చెప్పారు. అప్పటి వరకల్లా భారత్ అన్నింటా ముందుంటుందని చెప్పారు. అధిక జనాభా, మధ్యతరగతి ప్రజలు, పట్టభద్రులు, మౌలిక వసతులు, భారీ పెట్టుబపడులు, పట్టణీకరణతో భారత్‌ అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.

ఈ అంశాల కారణంగా భారత్ అభివృద్ధిపై అందరు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. గత రెండేళ్లలో భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. ప్రతి విషయం పైన భారత్, అమెరికాకు అంగీకారం లేకపోవచ్చునని, కానీ చాలా ముఖ్యమైనవి జరిగాయన్నారు.

Richard Verma

అమెరికా అధక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ను బలమైన సంపన్న దేశంగా చూడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా పని చేస్తోందన్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే దాదాపు 110బిలియన్ల వ్యాపారం జరుగుతోందన్నారు.

ఏటా ఇరు దేశాల మధ్య సుమారు 1.1 మిలియన్ల ప్రజల రాకపోకలుసాగిస్తున్నారని, 1.40లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించారన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచినట్లు చెప్పారు.

భారత్, అమెరికా దశాబ్దాలుగా వేర్వేరు ట్రాకుల పైన పయనించిందన్నారు. కానీ ఇప్పుడు ఆ ట్రాక్‌లు ఒక తాటిపైకి వస్తున్నాయని చెప్పారు. భారత్ గురించి ఇప్పుడు ఒబామాను అడిగితే.. భారత్‌ను బలమైన, సంపన్న దేశంగా చూడాలనుకుంటున్నట్లు చెబుతారన్నారు.

English summary
Expressing confidence that by 2030 India would lead the world in "almost every category", US Ambassador to India Richard R Verma today said people are excited about the Indo-US partnership which is poised to strengthen further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X