వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ తెగబడ్డ చైనా: భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు విఫలయత్నం.. రాళ్లదాడి!

జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

లడఖ్: స్వాతంత్ర్య దినోత్స వేళ చైనా మరోసారి తన దుందుడుకు వైఖరిని బయటపెట్టుకుంది. చైనా సైన్యం మరోసారి భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు విఫలయత్నం చేసింది. జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.

చైనా సైన్యం పాల్పడిన ఈ దుశ్చర్యకు భారత్ ధీటుగా బదులిచ్చింది. భారత జవాన్లు వారిని సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో చైనా సైనికులంతా మానవ హారంగా ఏర్పడి భారత సైనికులపై రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కొంతమంది సైనికాధికారులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.

Indian Army foils Chinese incursion in Ladakh

కాగా, టిబెట్ నుంచి భారత్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని మూడింట రెండు వంతుల భాగాన్ని చైనా నియంత్రిస్తూ వస్తోంది. దీనికి ఆనుకుని భారత్ వైపు ఉన్న ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతాలను కూడా ఆక్రమించాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం ఉదయం 6గం.9గం. మధ్యలో చైనా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు తెరపడినట్లుగా సైనికాధికారులు వెల్లడించారు.

English summary
The Indian Army on Tuesday foiled a Chinese incursion along the banks of Pangong Tso lake in Ladakh resulting in stone-pelting that caused minor injuries to soldiers on both sides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X