వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీడన్ టెక్ స్పేస్‌లో అగ్ర తాంబూలం భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లు స్వీడన్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్రవేస్తున్నారు. దీంతో భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాం ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. మెరుగైన పనితీరు, వినియోగదారులను సంతృప్తిపరచడంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ముందున్నారని స్టాక్‌హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్‌బర్గ్ తెలిపారు.

భారతీయ సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు మంచి పేరుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వినియోగదారులను సంతృప్తిపరచడంలో ఇతర కంపెనీలతో పోలిస్తే భారతీయ కంపెనీలు ముందున్నాయి అని స్టాక్‌హోం బిజినెస్ రీజియన్ మేనేజర్ బెంట్‌సన్ తెలిపారు.

Indian engineers score high in Sweden's tech space

2009-13 మధ్యకాలంలో 9366 మంది భారత పౌరులకు స్వీడన్ ప్రభుత్వం వర్క్‌పర్మిట్లు జారీచేసింది. అందులో 8803 మంది ఐటీ నిపుణులే ఉండటం గమనార్హం. స్వీడన్‌కు వచ్చే వారి విదేశీయుల్లో మొదటి స్దానంలో యూరోపియన్ యూనియన్‌కి చెందిన వారుంటే ఆ తర్వాత స్దానంలో భారత పౌరులున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్‌హోం సాంకేతిక రంగంలో సుమారు లక్షా ఇరవై ఐదు వేల మంది పనిచేస్తున్నారు. వీరంతా మొబైల్ సిస్టమ్స్, యాప్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్, ట్రేడింగ్ సాప్ట్‌వేర్‌లపై పనిచేస్తున్నారని తెలిపారు.

English summary
One of the most common jobs in this Swedish capital is that of a programmer or systems analyst and Indian software consultants here usually score high on performance and customer satisfaction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X