వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచారణలో జాప్యం: యూఎస్ కస్టడీలోని భారతీయుడు మృతి

విచారణలో జాప్యం కారణంగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారత్‌కు చెందిన 58ఏళ్లఅతుల్‌కుమార్‌ బాబుభాయ్‌ పటేల్‌ మృతి చెందాడు. మే 10న ఈక్వెడార్‌ నుంచి అట్లాంటా వచ్చిన అతుల్‌కుమార్‌ బాబుభాయ్‌ ప

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: విచారణలో జాప్యం కారణంగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారత్‌కు చెందిన 58ఏళ్లఅతుల్‌కుమార్‌ బాబుభాయ్‌ పటేల్‌ మృతి చెందాడు. మే 10న ఈక్వెడార్‌ నుంచి అట్లాంటా వచ్చిన అతుల్‌కుమార్‌ బాబుభాయ్‌ పటేల్‌ను విమానాశ్రయంలోనే నిర్బంధించారు అధికారులు.

ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు సరిగా లేవనే ఆరోపణలతో పటేల్‌ను యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగించారు. రెండ్రోజులపాటు పటేల్‌ను అట్లాంటా సిటీలోని డిటెన్షన్‌ సెంటర్‌లో నిర్బంధించి ఉంచారు.

Indian man detained at Atlanta airport, dies in custody

కాగా, పటేల్‌కు డయాబెటిస్‌, అధిక రక్తపోటు ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన్ని పరీక్షించిన వైద్య సిబ్బంది.. పటేల్‌కు బ్లడ్‌ షుగర్‌ ఎక్కువగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని అధికారులకు చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రికి చేరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. పటేల్‌ మృతి గురించి అధికారులు అమెరికాలోని భారత ప్రతినిధులకు, ఆయన కుటుంబానికి సమాచారాన్ని చేరవేశారు. తమ అదుపులో ఉన్న వ్యక్తులు చనిపోయిన ఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెప్పుకొచ్చారు.పటేల్ వద్ద తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకపోవడం వల్లే ఆయనను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించలేదని ఇమ్మిగ్రేషన్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

English summary
A 58-year-old Indian who was detained by American customs officials last week for not possessing necessary immigration documents while entering the country died in custody at an Atlanta hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X