వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య దారుణ హత్య: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఎన్నారై

ఎఫ్‌బీఐ టాప్‌-10 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ఓ ప్రవాస భారతీయుడు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఆ క్రిమినల్‌ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్‌.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఎఫ్‌బీఐ టాప్‌-10 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ఓ ప్రవాస భారతీయుడు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఆ క్రిమినల్‌ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్‌. భార్య పలక్‌తో కలిసి అమెరికాకు వెళ్లిన భద్రేశ్.. ఆమెను కొంత కాలం క్రితం దారుణంగా హత్య చేశాడు.

స్థానిక రెస్టారెంట్‌లో పని చేస్తున్న సమయంలో.. 2015 ఏప్రిల్‌లో భద్రేశ్‌.. తన భార్యతో గొడవపడి రెస్టారెంట్‌లోని వంటగదిలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపి పరారయ్యాడు.
. భద్రేశ్‌ భార్య పలక్‌ తిరిగి ఇండియా వెళ్లిపోదామని చెప్పేదని ఈ విషయంలోనే అతను గొడవపడి ఆమెను హతమార్చుంటాడని పోలీసులు అనుమానించారు.

Indian national on FBI's top ten fugitives' list

అయితే, ఇప్పటి వరకు భద్రేశ్ కుమార్‌ ఆచూకీ దొరకలేదు. దీంతో ఎఫ్‌బీఐ ఇతన్ని మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో చేర్చింది. ఇతన్ని పట్టిస్తే లక్ష డాలర్ల రివార్డ్‌ కూడా ప్రకటించింది.

కుమార్‌ని పట్టుకుని అరెస్ట్‌ చేసేంతవరకు కేసు వదిలిపెట్టమని ఇందుకుప్రజలు కూడా సహకరించాలని ఎఫ్‌బీఐ అధికారి జాన్సన్‌ మీడియాకు చెప్పారు. భద్రేశ్‌ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయి ఉంటుందని అతను అమెరికా వదిలి వెళ్లే అవకాశం కూడా లేదని తెలిపారు.

English summary
A 26-year-old Indian national wanted for the 2015 murder of his wife in Maryland is the newest addition to the FBI's ten most wanted Fugitives' list, and a reward of up to $100,000 is being offered for information leading to his capture, the Bureau and local police announced on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X