వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యునిలీవర్ పై సోఫియా ర్యాప్ పోరాటం (వీడియో)

|
Google Oneindia TeluguNews

కొడైకెనాల్: స్థానికుల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో వారికి దేశం నలుమూలల నుండి పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఒక్క పాట పాడి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది చెన్నయ్ కి చెందిన యువతి.

Indian Women Raps Against Unilever

ఈ దెబ్బకు ఫ్యాక్టరీ యాజమాన్యంపై పలువురు దేశ విదేశాల నుండి మండిపడుతున్నారు. వేసవివిడిదికి ప్రసిద్ది చెందిన తమిళనాడులోని కొడైకెనాల్ నడిబోడ్డున యునిలీవర్ ధర్మామీటర్ ఫ్యాక్టరీ ఉంది. నిత్యం ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్ధాలతో స్థానికులు ఆనారోగ్యం పాలవుతున్నారు.

స్థానిక మహిళలు ఎన్నోసార్లు పోరాటం చేసినా ఫలితం లేకుండ పోయింది. కారణం ఆ వార్త ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యింది. ప్రసిద్ది చెందిన యునిలీవర్ కంపెనీ చేస్తున్న తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చెయ్యడానికి చెన్నయ్ కి చెందిన సామాజిక కార్యకర్త సోఫియా అష్రఫ్ ముందుకు వచ్చారు.

ఫెయిర్ అండ్ లవ్లీ, పెప్ఫోడెంట్, లైఫ్ బాయ్ తదితర ఉత్పత్తులు వాడండి, క్షేమంగా ఉండండి అంటు ప్రచారం చేసుకునే మీరు (యునిలీవర్) కొడైకెనాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ర్యాప్ సాంగ్ పాడి సోషల్ మీడియాలో పెట్టింది. లక్షలాధి మంది ఈ వీడియోను చూసి సూపర్ మేడమ్ అంటున్నారు.

అంతే వరల్డ్ టాప్ ర్యాంపర్లలో ఒకరైన నిక్కి మినాజ్ సైతం సోఫియా పాట సూపర్ అంటు ట్విట్ చేశారు. ఈ వీడియోకు విశేష స్పందన వచ్చింది. గతంలో సోఫియా భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై పోరాటం చేశారు. ఏఆర్ రెహమాన్, సంతోష్ కుమార్ సంగీత దర్శకత్వంలో తమిళంలో పాటలు పాడారు.

English summary
Kodaikanal won't step down, until you make amends now" - Chennai-born rapper Sofia Ashraf's message to a corporate is loud, clear and catching on swiftly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X