వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డబ్బులు దొంగిలించగలరు, నైపుణ్యం దొంగిలించలేరు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నైపుణ్యంలో యువతకు శిక్షణ అవసరమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 'ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన' కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ నైపుణ్యం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.

యువత కోసం మహత్తర కార్యక్రమం తీసుకురావాల్సిన అవసరం గుర్తించే 'ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన'ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. యువతకు నైపుణ్యం తప్పనిసరని చెప్పిన ఆయన కేంద్రం ఇందుకు కొత్త పథకాలను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూడటం మనకు గర్వకారణంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచానికి భారత్ అవసరం ఏర్పడుతుందని చెప్పారు. పేదరికానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని, యువతకు నైపుణ్య శిక్షణ అందించడానికి రుణాలు మంజూరు చేస్తామని మోడీ వెల్లడించారు.

Indian youth has immense talent, says PM Narendra Modi at Skill India launch

ఎవరైనా జేబులో డబ్బులను ఎవరైనా దొంగిలించగలరు, కానీ నైపుణ్యానీ దొంగిలించలేరని పేర్కొన్నారు. మనలో నైపుణ్యం లేకపోతే మన అవసరం ఎవరికీ ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే 'స్కిల్ ఇండియా' కార్యక్రమం ద్వారా యువత కంటున్న కలలను సాకారం చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ఈ మిషన్ ద్వారా వచ్చే ఏడాదికి 24 లక్షల మందికి, 2022 నాటికి 40 కోట్ల 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణే లక్ష్యంగా 'ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన' పనిచేస్తుందన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారానే యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు.

English summary
On the occasion of World Youth Skills Day, Prime Minister Narendra Modi on Wednesday, July 15 launched the NDA government's much ambitious Skill India initiative at Vigyan Bhawan in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X