డచ్ మహిళపై అత్యాచారయత్నం: ఇద్దరు అరెస్ట్ (వీడియో)
ఇండోర్: నెదర్లాండ్స్‌కు చెందిన 24 ఏళ్ల విదేశీ మహిళపై హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లైంగికి దాడికి యత్నించిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భారత్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు నెదర్లాండ్స్ నుంచి ఇండోర్‌కు వచ్చిన ఓ మహిళ స్థానిక హోటల్ బస్ చేసింది.
హోటల్ ఉన్న భవనంలోనే షాపింగ్ మాల్ ఉంది. సోమవారం రాత్రి మాల్లోని పబ్‌లో డ్యాన్స్ చేసేందుకు వెళ్లిన ఆ యువతి అనంతరం అక్కడ తన మొబైల్ ఫోన్‌ని మరిచిపోయింది. ఆ తర్వాత తిరిగి తీసుకునేందుకు వెళ్లిన ఆ యువతిపై అక్కడ పనిచేసే ఇద్దరు భద్రతా సిబ్బంది ఆమెపై అత్యాచారానికి యత్నించారు.
దీంతో ఆ యువతి గట్టిగా కేకులు వేయడంతో నిందితులిద్దరూ పరుగు తీశారు. మంగళవారం మధ్యాహ్నాం బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.