వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్: అభిప్రాయ భేదాలతోనే సిక్కా నిష్క్రమణ! రేపు కొత్త సీఈవో ఎంపిక? అప్పటి వరకు...

ఇన్ఫోసిస్‌ యాజమాన్యంలో శుక్రవారం భారీ మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ సంస్థ కు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా తన పదవుల నుంచి హఠాత్తుగా వైదొలగారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ యాజమాన్యంలో శుక్రవారం భారీ మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ సంస్థ కు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా తన పదవుల నుంచి హఠాత్తుగా వైదొలగారు.

విశాల్ సిక్కా రాజీనామాతో సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న యూబీ ప్రవీణ్ రావు తాత్కాలికంగా ఎండీ, సీఈవో పగ్గాలు చేపట్టారు. కొత్త సీఈవో నియామకంపై శనివారం ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరోవైపు విశాల్ సిక్కా రాజీనామా వార్త బయటికి రాగానే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది.

ఇన్ఫీలో మూడేళ్లపాటు సేవలు...

ఇన్ఫీలో మూడేళ్లపాటు సేవలు...

2014 జూన్‌ 12న ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా ఆ పదువుల్లో మూడేళ్లపాటు కొనసాగారు. అసలు ఇన్ఫోసిస్ లో సిక్కా నియామకం కూడా విచిత్రంగా జరిగింది. ఇన్‌సైడర్లు మాత్రమే సంస్థను విజయవంతంగా నడిపించగలరనే నమ్మకానికి చరమ గీతం పాడుతూ, నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల బాట పట్టించే ఉద్దేశంతో.. ఇన్ఫోసిస్ యాజమాన్యం మొట్టమొదటిసారిగా పూర్తిగా బయటి వ్యక్తి అయిన విశాల్ సిక్కాను సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఇన్ఫోసిస్ పగ్గాలు అప్పగించింది.

Recommended Video

Good News for Techies Find Out More - Oneindia Telugu
శాప్ నుంచి ఇన్ఫోసిస్ లోకి...

శాప్ నుంచి ఇన్ఫోసిస్ లోకి...

విశాల్ సిక్కా ఇండో అమెరికన్. ఆయన తండ్రి భారతీయ రైల్వేలో ఆఫీసర్ గా పనిచేశారు. సిక్కా బాల్యం, విద్యాభ్యాసం అంతా బరోడాలో గడిచిపోయింది. బరోడాలోని రోజరీ హైస్కూల్ లో ఆయన చదువుకున్నారు. బరోడాలోని ఎంఎస్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిన తరువాత క్యాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ప్ లో డాక్టరేట్ చేశారు. సిలికాన్ వ్యాలీ ప్రముఖుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. ఇన్ఫోసిస్ లో చేరక ముందు విశాల్ సిక్కా జర్మనీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం శాప్ కు చెందిన గ్లోబల్ మేనేజింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉండేవారు. శాప్ వ్యవస్థాపకుడైన హాసో ప్లాట్నర్ కు సిక్కా అత్యంత సన్నిహితుడు. శాప్‌ను విజయపథాన నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2008లో సీటీవో ఫోరం ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేరిన సిక్కా 2006 నుంచి 2009 వరకు కాగ్ హెడ్ అడ్వయిజరీ బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగారు.

అభిప్రాయ భేదాలతో నిష్ర్కమణ?

అభిప్రాయ భేదాలతో నిష్ర్కమణ?

ఇన్ఫోసిస్ కొంతకాలంగా బాహ్య, అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. దీనికి తోడు కంపెనీ సహ వ్యవస్థాపకుల నుంచి ఎండీ, సీఈవో విశాల్ సిక్కా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ భేదాల కారణంగానే విశాల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఆస్తుల కొనుగోళ్లు, పెద్ద స్థానాల్లో ఉన్న వారి జీతభత్యాలపై సంస్థ వ్యవస్థాపకులు పలుమార్లు బాహాటంగానే సీరియ‌స్ అయ్యారు. ముఖ్యంగా విశాల్ సిక్కా ప్రైవేట్ చార్ట‌ర్స్‌లో వెళ్లి క‌స్ట‌మ‌ర్ల‌ను క‌ల‌వ‌డం, పాలో ఆల్టోలో ఆఫీస్ ఏర్పాటు చేయ‌డంపై నారాయ‌ణ‌మూర్తి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తంచేశారు. త‌న‌పై వ్య‌క్తిగ‌త దాడులు ఎక్కువైన కార‌ణంగానే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ఉద్యోగులకు రాసిన లేఖ‌లో సిక్కా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి విష‌యానికి నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ, వ్య‌క్తిగ‌త దాడుల‌కు దిగుతుంటే.. తాను సీఈవో ప‌ద‌విలో కొన‌సాగ‌లేన‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. త‌న‌పై గౌర‌వం, విశ్వాసం, సాధికార‌త ఉన్న ప‌ద‌విలో ఉండాల‌ని అనుకుంటున్న‌ట్లు సిక్కా తెలిపారు.

యూబీ ప్రవీణ్ రావుకు తాత్కాలిక బాధ్యతలు...

యూబీ ప్రవీణ్ రావుకు తాత్కాలిక బాధ్యతలు...


కొంతకాలంగా ఇన్ఫోసిస్ లోని సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక్కరొక్కరిగా తమ పదవులకు రాజీనామాలు చేయగా, ఇప్పుడు విశాల్ సిక్కా కూడా ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో విశాల్ సిక్కా రాజీనామాను కూడా ఆమోదించిన కంపెనీ.. ఆయన్ని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఇక నుంచి సిక్కా సంస్థ వ్యూహాత్మ‌క అంశాల‌పై దృష్టి సారించ‌నున్నారు. ఆయ‌న ఏడాది వేత‌నం ఒక డాల‌ర్‌. ఈ మేరకు శుక్రవారం కంపెనీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాత్కాలిక సీఈవోగా కంపెనీ సీవోవో యూబీ ప్రవీణ్ రావును నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ​

సంస్థ సీనియర్ నాయకుల్లో ఒకరిగా...

సంస్థ సీనియర్ నాయకుల్లో ఒకరిగా...

ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న యూబీ ప్రవీణ్ రావు అనూహ్య పరిణామాల నడుమ ఆ సంస్థ తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు. సంస్థ సీనియుర్ నాయకుల్లో ఒకరైన ప్రవీణ్ రావు ఇన్ఫోసిస్ లోనే గత 30 ఏళ్లుగా వివిధ పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ అధిపతిగా, యూరోప్ డెలివరీ హెడ్ గా, రిటైల్, కన్జ్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్, లాజిస్టిక్స్ అండ్ లైఫ్ సైన్సెస్ విభాగాలకు అధిపతిగా వ్యవహరించారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రవీణ్ రావు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లలో సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు, ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్(బీపీవో) కు కూడా చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ రావు.. బోనస్, ఇన్సెంటివ్ లు, షేర్లపై ఆదాయం అన్నీ కలుపుకుని ఏడాదికి రూ.6.4 కోట్ల వేతనం అందుకుంటున్నారు.

English summary
Infosys COO U B Pravin Rao has been named as the Interim- MD and CEO of the firm. Pravin as has overall strategic and operational responsibility for the entire portfolio of the company's offerings. Earlier today, Vishal Sikka resigned as managing director and chief executive of the company with immediate effect. He oversees the key functions of global sales, global delivery and business enabling functions. He drives and oversees the continuous renewal of key processes, systems and policies across the company in client relationship management, sales effectiveness, delivery excellence, quality, talent management and leadership development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X