వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్‌మీడియాతో జాగ్రత్త: పన్ను ఎగవేతదారులపై ఐటీశాఖ నిఘా

ఎంతో ముచ్చటపడి కొనుగోలుచేసిన కార్లు, ఇతర వస్తువులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంతో ముచ్చటపడి కొనుగోలుచేసిన కార్లు, ఇతర వస్తువులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక నుండి ఈ ఫోటోలు, వీడియోలను ఆదాయ పన్నుల శాఖ పరిశీలించనుంది. పన్ను ఎగవేత దారుల సమాచారాన్ని సేకరించేందుకు సోషల్ మీడియాను కూడ ఉపయోగించుకోనుంది ఆదాయపుపన్ను శాఖ.

పన్ను ఎగవేతదారులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లించకుండా పన్నుల ఎగవేస్తూ అక్రమాలకు పాల్పడేవారిని పట్టుకొనేందుకు సంప్రదాయమార్గాలను కాకుండా సోషల్‌మీడియా సహకారాన్ని కూడ తీసుకోనుంది ఆదాయపు పన్ను శాఖ.

 Instagram posts will soon help Modi government sniff out tax evaders

సోషల్ మీడియా ద్వారా పన్ను ఎగవేతదారుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఐటీ శాఖ ప్రయత్నాలను ప్రారంభించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్‌మీడియాను ఉపయోగించుకోనున్నారు.

తాజా నివేదికల ప్రకారంగా ఆదాయపు ప్రకటనలతో పాటు ఖర్చు నమూనాలతో సరిపోయాయో లేదో తాజా నివేదికల ప్రకారంగా అధికారులు ఆయా వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులను కూడ పరిశీలించనున్నారు. ఈ నెల నుండి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

ప్రాజెక్టు ఇన్‌సైడ్ పేరుతో ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అమలుకానుంది. ప్రాజెక్టు ఇన్‌సైడ్ ద్వారా 40శాతం పన్ను వసూలు పెరగనుంది అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం 156 మిలియన్ డార్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

తక్కువ పన్నును చెల్లించేవారిని అధికారులు సోషల్‌మీడియా ఆధారంగా గుర్తిస్తారు. ప్రాజెక్టు మొదటి దశలో 30శాతం నుండి 40 శాతం పరిశీలన ఉంటుంది. ఈ సమయంలో క్రెడిట్‌కార్డు ఖర్చు, ఆస్థి, స్టాక్ పెట్టుబడులు, నగదు కొనుగోళ్ళు డిపాజిట్లు సహ మొత్తం డేటా కొత్త వ్యవస్థకు మైగ్రేట్ అవుతోంది.

ఆ తర్వాత పోస్టల్‌ లేదా ఈ మెయిల్ ద్వారా టాక్స్ డిక్లరేషన్లను దాఖలు చేయాలని కేంద్ర బృందం సమాచారం పంపుతోంది. ఈ డేటా విశ్లేషణ పరిశీలనతో రెండో దశ డిసెంబర్ నుండి మొదలు కానుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ రిటర్న్‌కు జూలై 30వ, తేదితో గడువు ముగుస్తోంది.

English summary
A photo of your shiny new car on Instagram or the Facebook post about your chic holiday cottage may lead India’s taxman to your door.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X