వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయంపై అమితాబ్ న్యాయపోరాటం

|
Google Oneindia TeluguNews

లక్నో: సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ పై న్యాయపోరాటం చేస్తున్నారు. తన మీద కక్షసాధిస్తు బెదిరిస్తున్న ములాయం సింగ్ యాదవ్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

ఫిర్యాదు స్వీకరించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సోమప్రభ మిశ్రా విచారణ చేసి నివేదిక సమర్పించాలని హజ్రత్ గంజ్ పోలీసులకు ఆదేశించారు. కేసు తుదుపరి విచారణ ఆగస్టు 4వ తేదికి వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి సోమప్రభ మిశ్రా తెలిపారు.

IPS Officer Amitabh Thakur Moves Court Against Mulayam Singh Yadav

అమితాబ్ థాకూర్ తన న్యాయవాదితో కోర్టులో ఫిర్యాదు చేయించారు. జులై 11వ తేది హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో, జులై 23వ తేది లక్నో లో అమితాబ్ థాకూర్ ములాయం సింగ్ యాదవ్ మీద ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు.

ములాయం సింగ్ తనను బెదిరించారని ఆరోపిస్తు థాకూర్ మీడియాకు ఆడియో టేపులు విడుదల చేశారు. తరువాత ములాయం సింగ్ మీద కేసు పెట్టడానికి ప్రయత్నించారు. కక్షకట్టిన సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఆయన మీద రేప్ కేసు నమోదు చేయించారు. విధులు దుర్వినియోగం చేశారని మూడు రోజులకే థాకూర్ నుసస్పెండ్ చేశారు. థాకూర్, ఆయన బంధువుల ఆస్తుల వివరాలు బయటకు తీస్తున్నారు.

English summary
Chief Judicial Magistrate Som Prabha Mishra got the complaint registered and called for a report from Hazratganj police station and fixed the next date of hearing on August 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X