వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య,, అద్వానీ శిష్యుడే: వ్యూహాత్మకంగా మోడీ ఇలా?

రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ సరైన అభ్యర్థి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్నది. తదుపరి రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికైనప్పట్లు ప్రకటించడం లాంఛనమే. కానీ ఇంతకు ముందువరకు రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ సరైన అభ్యర్థి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సోమనాథ్ దేవాలయ ట్రస్టు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన అద్వానీకి గురు దక్షిణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అంతా ఆయనకు రాష్ట్రపతి పదవి ఖాయం అనుకున్నారు.

కానీ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో మున్ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఒకనాటి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న అద్వానీని పక్కకు తప్పించి వేసింది. కానీ ఆ అపవాదును తొలగించుకునేందుకు లాల్ కృష్ణ అద్వానీకి భారత్ రత్న అవార్డు ప్రదానం చేయాలని నరేంద్రమోదీ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ ఒకనాటి తన గురువుగా భావించే లాల్ లాల్ కృష్ణ అద్వానీని రాష్ట్రపతిగా కాకుండా అడ్డుకున్నారన్న అపవాదును తొలగించుకునేందుకు మోడీ ప్రయత్నిస్తారని అంటున్నారు.

ఏకాభిప్రాయ సాధనకు ఇలా యత్నాలు

ఏకాభిప్రాయ సాధనకు ఇలా యత్నాలు

అద్వానీకి భారత రత్న ఇచ్చే ఈ విషయాన్ని బీజేపీలోని అత్యంత సీనియర్ వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రపతి కాలేకపోయిన అద్వానీకి పరిహారంగానే భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడానికి కారణమైన నరేంద్రమోదీ సీనియర్ నేత పట్ల తన వైఖరి మార్చుకున్నారని వినికిడి. అయితే అద్వానీకి భారత రత్న అవార్డు ప్రదానం అంశం చాలా ప్రాథమిక దశలోనే ఉన్నదని ఆయనకు సన్నిహిత జర్నలిస్టు ఒకరు తెలిపారు. ఈ విషయమై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్తున్నారు.

అద్వానీ వర్గ ప్రసన్నానికి మోదీ ప్లాన్

అద్వానీ వర్గ ప్రసన్నానికి మోదీ ప్లాన్

ఇందుకోసం నరేంద్రమోదీ క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆ సీనియర్ జర్నలిస్టు అన్నారు. ఆ సీనియర్ మంత్రుల్లో అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌తోపాటు ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం అందజేయడం సరైన ఆలోచన అని వారంతా నరేంద్రమోదీ ముందు వాదించారని తెలుస్తున్నది. తద్వారా అద్వానీకి ద్రోహం చేశారన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు బీజేపీలో పెద్ద ప్రయత్నమే జరుగుతున్నది. తద్వారా బీజేపీలో అద్వానీ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు.

చట్టపరంగా అడ్డంకులే

చట్టపరంగా అడ్డంకులే

భారత రత్న అవార్డు ప్రదానం చేయడానికి రాజకీయ పరిణామాలు అద్వానీకి సానుకూలంగా ఉన్నాయి. కానీ బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో క్రిమినల్ నేరానికి కుట్ర పన్నాడన్న అభియోగం మాత్రం అద్వానీ అత్యున్నత పౌర పురస్కారం పొందడానికి చట్టపరంగా అడ్డంకిగా మారుతుందని భావిస్తున్నారు. ఆయనకు భారత రత్న అవార్డు ప్రదానం చేయడానికి న్యాయ నిపుణులు కూడా బాబ్రీ మసీదు విధ్వంసం కేసే కీలకమవుతుందని అంటున్నారు. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఉమా భారతితోపాటు మురళీ మనోహర్ జోషి తదితరులపై రాయబరేలీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అద్వానీ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. కనుక ఈ రెండేళ్లలో కేసు విచారణ పూర్తయి అద్వానీ సచ్చీలుడిగా బయటకు వస్తే ఆయనకు భారత రత్న అవార్డు ప్రదానం చేయడానికి అడ్డంకులేమీ లేవు. కానీ కేసులో దోషిగా ఉంటే మాత్రం కష్టమే మరి. క్రిమినల్ నేరాల్లో నిందితులుగా ఉన్న వారికి భారత్ రత్న అవార్డు ప్రదానం చేయరాదని బాబ్రీ యాక్షన్ కమిటీ న్యాయవాది జాఫర్యాబ్ జిలానీ తెలిపారు.

దేశమంతా గాంధీ నాయకత్వంలో పోరు.. అద్వానీ ఆర్ఎస్ఎస్ లో చేరిక

దేశమంతా గాంధీ నాయకత్వంలో పోరు.. అద్వానీ ఆర్ఎస్ఎస్ లో చేరిక

క్రిమినల్ నేరంలో నిందితుడిగా ఉన్న భారతరత్న అవార్డు ప్రదానం చేయాలని ఒకవేళ నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయంగా పలు సమస్యలను తెచ్చి పెడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో పలువురు సాక్ష్యులు మరణించారు. చాలా మంది వయస్సు మీద పడటంతో బాబ్రీ మసీద్ విధ్వంసం ఘటన వివరాలు మరిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అద్వానీ జీవితంలో పలు రహస్య ఘటనలు ఉన్నాయని రాజకీయ నిపుణుడు శామ్స్ ఉల్ ఇస్లాం వ్యాఖ్యానించారు. 1942లో భారతదేశంలో ఉధ్రుతంగా జాతీయోద్యమం సాగుతున్న దశలో యావత్ జాతి అంతా గాంధీజీ సారథ్యంలో ముందుకు వెళితే.. అద్వానీ మాత్రం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారని ఆయన గుర్తు చేశారు. వీర సావార్కర్‌ను దేశభక్తుడని చాటి చెప్పడానికి అద్వానీ విశ్వ ప్రయత్నాలు చేశారు.

వాజ్ పేయికి భారత రత్న కోసం ఇలా ప్రధాని మన్మోహన్‌కు అద్వానీ లేఖ

వాజ్ పేయికి భారత రత్న కోసం ఇలా ప్రధాని మన్మోహన్‌కు అద్వానీ లేఖ

భారత్ డిప్యూటీ ప్రధానిగా పని చేసిన అద్వానీ.. తొలిసారి సావర్కర్ గొప్పతనాన్ని పొడిగారు. అటల్ బీహారీ వాజ్ పేయి సర్కార్ సావర్కర్‌కు భారత రత్న అవార్డు ప్రదానం చేయాలని భావించినా.. నిరసనలతో వెనక్కు తగ్గింది. 2008 జనవరిలో మాజీ ప్రధాని వాజ్ పేయికి భారత రత్న అవార్డు ప్రదానం చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందుకు అంగీకరించలేదు. 2015లో నరేంద్రమోదీ ప్రభుత్వం.. వాజ్ పేయికి భారత రత్న అవార్డు ప్రదానం చేసింది. అద్వానీకి కూడా భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

నేరవేరని అద్వానీ అభిమతం

నేరవేరని అద్వానీ అభిమతం


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన అద్వానీ.. తొలి నుంచి తెర వెనుకే ఉండిపోయారు. గతంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయి హయాంలోనూ ఇదే కొనసాగింది. ఇదే ప్రక్రియ మోదీ హయాంలోనే కొనసాగుతూ వచ్చింది. పీఎంవోలో అడుగుబెట్టి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆయన అభిమతం, ఆకాంక్షలు అడియాసలుగానే మిగిలిపోయాయి. చివరిగా రాష్ట్రపతిగా నైనా రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఆలోచనకూ తిలోదకాలిచ్చారు. ఇక భారత రత్న అవార్డు లభిస్తుందా? అని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Advani, despite being the chief architect of the BJP’s rise to power, has always remained in the shadow of former Prime Minister Atal Behari Vajpayee in the past. And he continues to be in shadow of Modi. His ambition to reach the PMO never materialised. His dream to become the First Citizen of the country is also shattered. So, will he get the Bharat Ratna?PMO never materialised. His dream to become the First Citizen of the country is also shattered. So, will he get the Bharat Ratna?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X