బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఐటీ సోదాలు: రూ.5 కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్ది బంగారం సీజ్

ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.4 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.5 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు బెంగళూరులో నివాసం ఉంటున్న ఇద్దరు అధికారుల ఇళ్లలో నిర్వహించారు.

ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఆ ఇద్దరు అధికారుల వద్ద మరింత కొత్త కరెన్సీ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ దిశలోను విచారణ జరుపుతున్నారు.

it

తాము సోదాలు నిర్వహించామని, పెద్ద మొత్తంలో డబ్బులు సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీతో పాటు ఐదు కిలోల బంగారు ఆభరణాలు, ఓ ఖరీదైన కారును గుర్తించారు.

కాగా, ఐటీ అధికారులు గత రెండు రోజులుగా బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం నాడు కూడా సోదాలు నిర్వహించారు. నిన్న ముఖ్యమంత్రికి దగ్గరివాడైన ఓ అధికారి ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు.

English summary
IT raids in Bengaluru- Rs 4 crore in new currency, Lamborghini found in two locations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X