వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలపై వేటుకు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు పరిహరాల పెంపు కూడ కారణమేనా?

దేశీయ టెక్ దిగ్గజం ఇన్పోసిస్ అవలంభిస్తున్న విధానాలపై ఐటీ ఉద్యగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: దేశీయ టెక్ దిగ్గజం ఇన్పోసిస్ అవలంభిస్తున్న విధానాలపై ఐటీ ఉద్యగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లకు భారీగా పరిహారాలు పెంచుతూ ఉద్యోగులపై వేటేస్తోందని ఐటీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి.

ఉద్యోగాల కోతతో తీవ్ర సతమతమౌతున్న ఉద్యోగులకు ఈ పరిహారాల పెంపు మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొంటున్నాయి.. ఇన్పోసిస్ కంపెనీ తన వెబ్ సైట్ లో పొందుపర్చిన 2017 వార్షిక రిపోర్టులో గత ఆర్థిక సంవత్సరం నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 50 శాతానికి పైగా పరిహారాలు పెంచినట్టు తెలిసింది.

ప్రతి ఏటా ఐటీ కంపెనీలు నిపుణులపై వేటువేస్తూ అదే సమయంలో టాప్ ఎగ్జిక్యూటివ్ లకు వేరియబుల్ పే, స్టాక్ ప్రోత్సాహకాల పేరుతో భారీగా వేతనాలు పెంచుతున్నాయని ఎప్ఐటీఈ జనరల్ మేనేజర్ ఏజే వినోద్ మండిపడ్డారు.

IT workers groups flay steep hike in top executives compensation

రాజకీయ నాయకుల వలే కంపెనీ వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు.ప్రజల సమస్యలన్నీ పక్కనపెట్టి వారు వేతనాలను మాత్రం పెంచుకొంటున్నారని ఆరోపించారు. ఇది చాలా బాధాకరమన్నారు.చెన్నై, పూణే, బెంగుళూరులతో పాటు తొమ్మిది ఐటీ హబ్స్ లలో ఐటీ ఉద్యోగుల కోసం ఎఫ్ ఐ టీ ఈ ఫోరంగా ఏర్పడింది.

ఇన్సోసిస్ వార్షిక రిపోర్ట్ ప్రకారం అధ్యక్షులు రాజేష్ మూర్తి, సందీప్ డాడ్లాని, హోహిత్ జోషి, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవికుమార్ లు మొత్తం పరిహారాల కింద 14 కోట్లకు పైగా అందుకొన్నారు. పనితీరు ఆధారంగా స్టాక్ ప్రోత్సాహాకాల కింద ఈ పెంపును చేపట్టినట్టు కంపెనీ పేర్కొంది. టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 10 లేదా 20 శాతం పరిహారాలు పెంచితే కంపెనీ అకౌంట్ లో నుండి భారీఎత్తున నగదు తరలివెళ్ళనుందని, ఈ ప్రభావంతో వెంటనే ఫ్రోఫెషనల్స్ పై కంపెనీ వేటు వేస్తోందని ఎప్ ఐ టీ ఈ ప్రకటించింది.

English summary
Two IT employee groups have flayed the steep hike in compensation awarded to top executives of Infosys, terming the move by the software giant as “painful” amid job losses in the industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X