వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ దుర్మార్గం: బార్డర్ పౌరులే లక్ష్యంగా పదేపదే కాల్పులు, యువతి మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన చట్టాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. మంగళవారం నాడు పాక్ రేంజర్లు మరోసారి కాల్పులు జరిపారు. సాధారణ పౌరులే లక్ష్యంగా వాళ్లు కాల్పులు జరుపుతూ దురాఘతానికి పాల్పడుతున్నారు.

రాంఘర్ సెక్టారులో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని తెలుస్తోంది. మరో ఎనిమిది మంది పౌరులకు గాయాలయ్యాయి. సరిహద్దు వద్ద సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకోవడం గమనార్హం. సరిహద్దులో వరుసగా కాల్పులు చోటు చేసుకుంటుండటంతో ఉద్రిక్తత కనిపిస్తోంది.

 J&K: 1 killed, 3 injured in multiple ceasefire violations by Pakistan

ఈ రోజు ఉదయం నుంచి నిరంతర కాల్పులు జరుగుతున్నాయి. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. రాజౌరి, రాంఘర్, అర్నియా తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాంఘర్‌లో జరిగిన కాల్పుల్లో ఓ 19 ఏళ్ల యువతి రోజీ కూడా చనిపోయాడని తెలుస్తోంది. ఈమెది జెర్దా జిల్లా.

మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయానికి పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ జమ్ము ఫ్రాంటియర్ డిఐజి ధర్మేంద్ర పరేఖ్ చెప్పారు. ఆ తర్వాత నాలుగైదు సెక్టార్లలో కాల్పులు జరిపారన్నారు. రాంఘర్, అర్నియాలతో పాటు శాంబా, జమ్ము జిల్లాల్లోను కాల్పులు జరిగాయన్నారు. ఫిరంగులతోను కాల్పులు జరుపుతున్నారన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు తగిన జవాబిస్తున్నారని చెప్పారు.

English summary
A civilian was killed and three others injured on Tuesday in indiscriminate shelling by Pakistan Rangers along the International Border (IB) in Jammu and Kashmir's Samba district, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X