వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వ్యతిరేక ర్యాలీ: పాక్ జెండాను ప్రదర్శించిన మసరత్ ఆలం(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం భట్ మరో వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. బుధవారం హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ జిలానీ రాక సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జాతీయ జెండాను ప్రదర్శించాడు. ఐదేళ్ళ తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో అడుగుపెట్టిన జిలానీకి స్వాగతం పలుకుతూ పలువురు యువకులతో ఆలం నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మసరత్ ఆలంతోపాటు ర్యాలీలో పలువురు పాకిస్థాన్ జెండాలు ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో యువకులు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై రాళ్లు కూడా రువ్వారు.

J&K: Pakistani flags unfurled in separatist leader Masarat Alam's rally in Srinagar

పాక్ జెండాను ప్రదర్శించడమేగాక దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకుగాను మసరత్ ఆలం, జిలానీతోపాటు పలువురిపై పోలీసులు అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.

మసరత్ ఆలం చర్య పట్ల బిజెపి నాయకుడు జివిఎల్ నర్సింహ మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు తాము అంగీకరించబోమని చెప్పారు. ఇలాంటి చర్యలపై ముఫ్తీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, మసరత్ ఆలం చర్య కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జమ్మూకాశ్మీర్‌లోని బిజెపి-పిడిపి ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వేర్పాటువాదుల పట్ల సున్నితంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

2010లో హింసకు దారితీసిన నిరసన చేపట్టినందుకు జైలుపాలైన మసరత్‌ను.. ఇటీవల ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పిడిపి-బిజెపి ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

రాజ్‌నాథ్ సీరియస్

భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు పాక్ జెండాను ప్రదర్శించిన వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ ముఫ్తీ ప్రభుత్వాన్ని సూచించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు.

English summary
Days after his release from jail, separatist leader Masarat Alam on Wednesday held an anti-India rally in Srinagar in which his supporters were spotted carrying Pakistani flags, media reports claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X