బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో నుంచి కిల్లర్ బీడి కింగ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

త్రివేండ్రం: సెక్యూరిటీ గార్డు హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నకేరళ బీడి కింగ్ మహమ్మద్ నిషామ్ జైల్లో నుంచి తన కార్యకలాపాలు విచ్చలవిడిగా చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, భార్య సహకారంతో తన వ్యాపారాలు చేసుకుంటూ ప్రత్యర్థులను బెదిరిస్తున్నాడు.

అంతే కాకుండ మహ్మమద్ నిషామ్ తన సొంత మొబైల్ నుంచి ఇద్దరు సోదరులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తా, మిమ్మల్ని లేపేస్తా అంటు బెదిరింపులకు పాల్పడ్డాడు. నిషామ్ ఇద్దరు సోదరులు ప్రాణ భయంతో కేరళలోని త్రిసూర్ రూరల్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

త్రిసూర్ లో తన ఇంట్లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డును చితకబాది కారుతో తొక్కించి హత్య చేశాడు. ఆలస్యంగా గేటు తీశాడనే నెపంతో సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేశాడు. మహమ్మద్ నిషామ్ ను బెంగళూరులోని విజయ్ మాల్యా రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.

Jailed beedi

తరువాత అతను కేరళలలో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన విషయం వెలుగు చూసింది. కేరళ పోలీసులు మహమ్మద్ నిషాన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం మహమ్మద్ నిషాన్ కన్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభివిస్తున్నాడు. జైల్లో మహమ్మద్ నిషామ్ చేస్తున్న వ్యవహారాలపై కేరళ జైళ్ల శాఖ డీజీపీ విచారణ చేస్తున్నారు.

జైల్లో నిషామ్ కు వీఐపీ మర్యాదలు చేస్తున్నారని, అతనికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కేరళ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల డిమాండ్ చేస్తున్నారు. మాకు మహమ్మద్ నిషామ్ నుంచి ప్రాణహాని ఉందని అతని సోదరులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

English summary
The kin of Nisham, who has been convicted of killing a security guard by driving his Hummer into him, have alleged that he has access to a mobile phone inside the jail through which he was also running his business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X