చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

4రోజులైనా మెరీనా బీచ్‌లోనే: రజినీ మద్దతు, రెహమాన్ దీక్ష!(పిక్చర్స్)

జల్లుకట్టును కొనసాగించాలంటూ నాలుగో రోజు కూడా చెన్నై మెరీనాబీచ్‌లో నిరసనకారులు అలాగే తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు నిరసనలు రోజు రోజుకూ ఉధృతమవుతున్నాయి. జల్లుకట్టును కొనసాగించాలంటూ నాలుగో రోజు కూడా చెన్నై మెరీనాబీచ్‌లో నిరసనకారులు అలాగే తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోనూ అక్కడినుంచి కదలకపోవడం గమనార్హం. మరోవైపు జల్లికట్టుకు మద్దతుగా ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు.

తాజాగా, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ జల్లికట్టుకు మద్దతు పలకగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. విద్యార్థులు మొదలుపెట్టిన ఈ నిరసన కాస్తా ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది.

జల్లికట్టు కోసం అందరూ..

జల్లికట్టు కోసం అందరూ..

జల్లికట్టును కొనసాగించాలంటూ.. లాయర్లు, నటులు, కళాకారులు, ఐటీ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు నిరసనల్లో పాల్గొంటున్నారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము ధిక్కరించలేమని, ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డినెన్సు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేయడంతో నిరసనలు మరింత తీవ్రతరమయ్యాయి.

ప్రముఖుల మద్దతు

ప్రముఖుల మద్దతు

రెహ్మాన్ ఇప్పటికే తన నిరాహార దీక్ష విషయాన్ని ప్రస్తావించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన అభిమానులకు పిలుపునిస్తారని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కమల్‌హాసన్ కూడా వ్యక్తిగతంగా జల్లికట్టు ఉండాల్సిందేనని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

సంస్కృతిలో భాగమే..

సంస్కృతిలో భాగమే..

కాగా, ఆధ్యాత్మిక గురువులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ లాంటి వారు కూడా నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. జల్లికట్టు అనేది తమిళ సంస్కృతిలో భాగమని, అది పొంగల్ పండుగ సంబరాల్లో అంతర్భాగమని అన్నారు. జల్లికట్టుకు తాను మద్దతిస్తున్నానని, నిరసనలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని రవిశంకర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో సరైన వాస్తవాలతో మరో తాజా అప్పీలు దాఖలు చేద్దామన్నారు.

ఉత్సవమే..

ఉత్సవమే..

జంతువులకు పండుగను అంకితం చేసే ఉత్సవం లాంటిదే జల్లికట్టు అని, ప్రజల సాంస్కృతిక బలాన్ని తీసేసుకుంటామంటే కుదరదని, ముఖ్యంగా పల్లెల్లో ఇవి చాలా ముఖ్యమని జగ్గీ వాసుదేవ్ అన్నారు.

దారిలోనే ఉందంటూ సీఎం..

దారిలోనే ఉందంటూ సీఎం..

ఇది ఇలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం జల్లికట్టుకు అందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. 'బిగ్ డే' దారిలోనే ఉందని అందులో చెప్పారు.

English summary
Top Tamil Nadu celebrities Rajinikanth, Kamal Haasan, AR Rahman and Viswanathan Anand came out in support of Jallikattu on Thursday, as protests against a court ban on the traditional and popular bull-taming sport continued to rock the southern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X