చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలితకు లభించని ఊరట: విభేదించిన ఇద్దరు జడ్జిలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఊరట లభించలేదు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) తొలగింపు కేసు పై న్యాయస్థానం ముందుకు వచ్చింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Jayalalithaa

ప్రత్యేక పీపీ భవానీ సింగ్‌ను తొలగించాలని గతంలో జయలలిత గతంలో కేసు వేశారు. దీనిపై డీఎంకే నేత అన్బజగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, భవానీ సింగ్ అపాయింటుమెంట్ పైన ద్విసభ్య బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు విభేదించారు.

భవానీ సింగ్ అపాయింటుమెంట్ సరికాదని ఓ న్యాయమూర్తి అయిన జస్టిస్ మదన్ బీ లోకుర్ అన్నారు. మరో న్యాయమూర్తి భానుమతి మాత్రం దానిని సమర్థించారు. దీంతో దీనిని త్రిసభ్య బెంచ్‌కు అప్పీల్ చేశారు. కాగా, జయలలిత అక్రమంగా రూ.66.65 కోట్ల ఆస్తులు కూటబెట్టారన్న కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

English summary
The judgment on a petition filed by DMK leader K Anbazhagan for removal of Bhavani Singh as the special public prosecutor in the appeals filed by former Tamil Nadu chief minister J Jayalalithaa in a disproportionate assets case worth Rs 66.65 crore was left for a three-judge bench after two judges gave contradictory verdicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X