వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత పోయెస్ గార్డెన్‘ప్యాలెస్’ఇదే అంటూ ! (ఫోటోలు)

జయలలిత 25 ఏళ్ల రాజకీయ చరిత్రకు కేరాఫ్ అడ్రస్ అయిన పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం ఇల్లు ఇదే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం ఇంటిని ఒక్క సారైనా చూడాలని అందరికి ఆశ ఉంటుంది. అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు అయితే ఒక్క సారి అమ్మ ఇంట్లో అడుగు పెట్టాలని కోరుకుంటారు.

జయలలిత మరణించిన తరువాత ఆ ఇంటిలో ఆమె ప్రాణస్నేహితురాలు నెచ్చెలి శశికళ అండ్ కో మకాం వేశారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జయలలిత ఇంటిలోకి సామాన్యులు ఎవ్వరూ అడుగుపెట్టలేరు.

జయలలిత ఎంతో ఇష్టపడి పోయెస్ గార్డెన్ లోని ఇంటిని కొనుగోలు చేసి వేద నిలయం అని పేరు పెట్టుకున్నారు. జయలలిత మొదట తన తల్లితో కలిసి ఆ ఇంటిలో ఉండే వారు. ఆ తరువాత సోదరుడు జయకుమార్ (దీపా తండ్రి) కుటుంబ సభ్యులు ఆ ఇంటిలో ఉన్నారు.

శశికళ అడుగు పెట్టారు

శశికళ అడుగు పెట్టారు

శశికళ జయలలితకు పరిచయం అయిన తరువాత ఆ ఇంటిలో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. జయలలిత సోదరుడు జయకుమార్ కుటుంబ సభ్యులు పోయెస్ గార్డెన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

లోపలికి మాత్రం నో

లోపలికి మాత్రం నో

జయలలిత ఇంటిలోకి ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వెళ్లలేకపోయారు. ఎవరైనా సరే హాల్ లో అమ్మను మాట్లాడి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి.జయలలిత 25 ఏళ్ల రాజకీయ చరిత్రకు కేరాఫ్ అడ్రస్ వేద నిలయం.

శశికళ అండ్ కో

శశికళ అండ్ కో

జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు పోయెస్ గార్డెన్ లోని ప్రతి అనువు తెలుసు. ఆ ఇంటిలో పని చేస్తున్న వారు అందరూ మన్నార్ గుడి నుంచి వచ్చిన వారే.

సెక్యూరిటీ సిబ్బంది సైతం మన్నార్ గుడి

సెక్యూరిటీ సిబ్బంది సైతం మన్నార్ గుడి

జయలలిత ఇంటి దగ్గర బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు సైతం మన్నార్ గుడి ప్రాంతానికి చెందిన వారే. జయలలి ఇంటిలో పని చేస్తున్న సిబ్బంది అందరూ మన్నార్ గుడి వాసులే.

అమ్మ ఇల్లు చూడాలని ఉంది

అమ్మ ఇల్లు చూడాలని ఉంది

జయలలిత ఇల్లు చూడాలని ఉందని అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు అంటుంటారు. అయితే ఇప్పటి వరకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకులు కొందరే జయలలిత ఇల్లు చూశారు.

సినిమా షూటింగ్ లు

సినిమా షూటింగ్ లు

జయలలిత ఇంటిలో అనేక సినిమా షూటింగ్ లు జరిగాయి. తనకు అత్యంత సన్నిహితులైన దర్శకులు మాత్రం సినిమా షూటింగ్ చేసుకోవడానికి జయలలిత అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం జయలలిత ఇంటి విలువ రూ. 90 కోట్లు.

దాసరి నారాయణరావు

దాసరి నారాయణరావు

ఇటీవల దాసరి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ తాను జయలలిత ఇంటిలో దాదాపు 10 సినిమాల షూటింగ్ లు చేశానని, మాకు అదే ఇంటిలో జయలలిత భోజనం తయారు చేయించి వడ్డించారని చెప్పారు.

జయలలిత మరణించిన తరువాత

జయలలిత మరణించిన తరువాత

జయలలిత మరణించిన తరువాత సోషల్ మీడియాలో జయలలిత పోయెస్ గార్డెన్ ఇల్లు ఇదే అంటూ కొన్ని పోటోలు, వీడియోలు పెట్టారు. అందులో ఈ ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.

జయలలిత ఇల్లు కాదు, ఏది నిజం ?

జయలలిత ఇల్లు కాదు, ఏది నిజం ?

అయితే జయలిత ఇంటిలోకి అంత ధైర్యంగా వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకు వచ్చే దమ్ము ఎవ్వరికి లేదు. పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇల్లు, అమ్మ ఇంటి పక్కన ఉన్న రజనీకాంత్ ఇల్లు ఇదే అంటూ కొందరు ఫోటోలు వీడియోలు పెట్టారు.

అంతా అపద్దం

అంతా అపద్దం

అయితే ఈ ఫోటోలు, వీడియోలు జయలలిత ఇంటివి కావని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఎవో ఫోటోలు తీసి జయలలిత ఇల్లు ఇదే అంటు సోషల్ మీడియాలో పెట్టారని, తాము ఆ ఇంటిని ఇప్పటి వరకు చూడలేదని అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫోటోలు, వీడియో జయలలిత ఇల్లు అంటు చక్కర్లు కొడుతున్నాయి.

English summary
Jayalalithaa’s house Veda Nilayam, Poes Garden, was an address that lent its name to a neighbourhood that for 25 years was symbolic with the weight of political power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X