వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం:వదినతో వివాహేతర సంబంధం, కుటుంబాన్ని హత్య చేశాడిలా.....

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని బలితీసుకొంది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ ప్రబుద్దుడు భార్య ,మరదలు, పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ధన్ బాద్:వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని బలితీసుకొంది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ వ్యక్తి ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకుగాను కుటుంబాన్ని హతమార్చాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

జార్ఖండ్ రాష్ట్రంలోని బరోరా ప్రాంతానికి చెందిన ఓం ప్రకాష్ చౌహన్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ కంపెనీలో డంపర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఓం ప్రకాష్ చౌహాన్ తన వదినతో వివాహేతర సంబంధం ఏర్పరచుకొన్నాడు.

Jharkhand man kills wife, two children and sister in law by poisoning, then kills self

తమ సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్యను చేశాడు. తాను ఉండే గదిలోనే భార్య శవాన్ని పడేశాడు. అతని మరదలు నీతూ చౌహన్ తన భార్య గురించి వాకబు చేస్తే ఆమెను కూడ ఆయన హత్య చేశాడు.

అయితే భార్య, మరదలను హత్య చేసిన సమయంలో పిల్లలు ఈ దారుణాన్ని చూశారు.దీంతో ఈ దారుణం బయటకు వస్తోందనే ఉద్దేశ్యంతో పీయూష్, హర్షిత్ అనే ఇద్దరు చిన్నారులకు కూడ ఆయన హత్య చేశారు. వీరిద్దరూ ఓం ప్రకాష్ చౌహన్ పిల్లలు.

ఆదివారం ఉదయం బ్యూటీషీయన్ కోర్సు కోసం బరోరా వెళ్ళిన నీతూ ఎంతకి రాకపోవడంతో ఆమె అన్నయ్య బినోద్ నోనియో చౌహన్ కు ఫోన్ చేశాడు.

నీతూ ఇక్కడే ఉంది. సాయంత్రం వస్తోందని సమాధానం చెప్పాడు. సాయంత్రమైనా నీతూ రాకపోవడంతో బినోద్ ...ఓంప్రకాష్ చౌహాన్ వద్దకు వెళ్ళాడు. అయితే అతడిని చూసిన ఓం ప్రకాష్ ఇంటి వెనుక నుండి పారిపోయాడు.

అనుమానం వచ్చిన బినోద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే తలుపులు పగులగొట్టి చూస్తే ఓం ప్రకాష్ చౌహాన్ భార్య సుమన్ దేవి, మరదలు నీతూ, పిల్లలు పీయూస్, హర్షిత్ ల మృతదేహాలు కన్పించాయి.

English summary
In a shocking incident, a man in Jharkhand’s coal town of Dhanbad killed his wife, their two young children and his sister in law by poisoning before committing suicide before a running train on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X