వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన పొలింగ్: కాశ్మీర్‌లో 70% పైగా ఓట్లు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం తొలి విడత పోలింగ్ ముగిసింది. జార్ఖండ్‌లో 13 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. పొలింగ్ ముగిసే సమయానికి 61.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రాధమిక అంచనా మాత్రమేనని ఇంకా పెరిగే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది.

ఇక జమ్మూ కాశ్మీర్‌లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని తీవ్రవాదులు, మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసినా.. ఓటర్లు ఏ మాత్రం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బందిపూర్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఉగ్రవాదులు బాంబును పేల్చారు. పోలింగ్ కేంద్రం వెలుపల ఈ ఘటన జరగటం, తక్కువ తీవ్రత కలిగిన బాంబు కావడంతో ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించాయి. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు, తీవ్రవాద సంస్ధలు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

చలికి నెమ్మదించిన పోలింగ్:

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కాస్తంత నెమ్మదిగా సాగుతోంది. కాశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రావటానికి భయపడుతున్నారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలోనూ ఉష్ణోగ్రత 6 డిగ్రీలు మాత్రమే ఉండటంతో మధ్యాహ్నం తరువాత ఓటర్ల రాక పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, తొలి దశలో భాగంగా కాశ్మీర్ లో 15, జార్ఖండ్ లో 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి.

జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమయింది. జార్ఖండ్ లో 33.65 లక్షలు, జమ్మూ కాశ్మీర్ లో 10.50 లక్షల మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జార్ఖండ్ లో ఈ రోజు పోలింగ్ జరుగుతున్న 13 నియోజకవర్గాలు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈసారి కాశ్మీర్‌లో నాలుగు పార్టీలు పోటీలో ఉండగా, జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా, బీజేపీలు తలపడుతున్నాయి.

జార్ఖండ్‌లో మందుపాతర స్వాధీనం

జార్ఖండ్‌లోని హుస్సేన్ బాగ్ నియోజక వర్గంలో అధికారులు మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. పాలమావ్ జిల్లాలోని హరిహరగంజ్ ప్రాంతంలో రోడ్డు పక్కన పెట్టిన మందుపాతరను భద్రతాదళాలు గుర్తించి నిర్వీర్యం చేసినట్లు ఎస్పీ మయార్ పటేల్ చెప్పారు.

 పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్‌ నియోజక వర్గంలో ఓటు వేసేందుకు వచ్చి ముసలావిడ.

 పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో లథేర్ నియోజక వర్గంలో పోలింగ్ బూత్‌లో పోలీసులు పరాహారా.

 పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బందిపూరా జిల్లాలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు.

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బందిపూరా జిల్లాలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు పహారా కాస్తున్న భద్రతా బలగాలు.

 పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ నియోజక వర్గంలో ఓటు వేసేందుకు వచ్చిన పార్లమెంట్ సభ్యుడు తుపస్ధాన్ చువాంగ్.

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ నియోజక వర్గంలో ఓటు వేసిన ఓ మహిలా వృద్దురాలు.

 పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

పొలింగ్: కాశ్మీర్‌లో బాంబు, జార్ఖండ్‌లో మందుపాతర

తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ నియోజక వర్గంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు.

English summary
Defying a Maoist boycott call, over a quarter of Jharkhand's voters exercised their franchise before noon on Tuesday in the first phase of ballotting for the assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X