వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఫోన్‌ను.. బల్క్‌లో బుక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

జియో ఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ కంపెనీ ‘కీప్‌ మి పోస్టెడ్‌’ పేరుతో ఒక రిజిస్ట్రేషన్‌ పేజీని బ్యానర్‌గా తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది. ఈ పేజీలో అంతకముందు కేవలం ఒక్క ఆప్షన్‌ మాత్రమే ఉండేది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఫోన్ ను బుక్ చేసుకునేందుకు ఆ కంపెనీయే స్వయంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఫోన్‌ పొందడానికి, దాని అప్‌డేట్లను తెలుసుకోవడం కోసం కంపెనీ తన వెబ్‌సైట్‌లో 'రిజిస్ట్రేషన్‌ పేజీ'ని కూడా ప్రారంభించింది.

రిలయన్స్‌ ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక సాధారణ సమావేశంలో జీరోకే జియో ఫోన్‌ను ముఖేష్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ స్పెషిఫికేషన్లతో ఈ ఫోన్‌ అందుబాటులోకి కూడా వస్తోంది.

JioPhone will be available to enterprise users in bulk, registration starts from August 24

ఈ ఫోన్‌ కొనుక్కోవాలంటే తొలుత రూ.1500తో దీన్ని బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత మన నగదును మనకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. టెస్టింగ్‌కు కాస్త ముందుగానే అంటే ఆగస్టు 15 నుంచే జియో ఫోన్‌ అందుబాటులోకి వస్తోంది.

జియో ఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ కంపెనీ 'కీప్‌ మి పోస్టెడ్‌' పేరుతో ఒక రిజిస్ట్రేషన్‌ పేజీని బ్యానర్‌గా తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది. ఈ పేజీలో అంతకముందు కేవలం ఒక్క ఆప్షన్‌ మాత్రమే ఉండేది. ఒక వ్యక్తి మాత్రమే తమ ఆసక్తిని రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఉంచిన జియో, ప్రస్తుతం బిజినెస్‌ అనే మరో ఆప్షన్‌ను కూడా ఉంచింది.

బిజినెస్‌ మోడ్‌లో కూడా ఈ ఫోన్‌ను ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లు రిజిస్ట్రర్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌ నేమ్‌, కంపెనీ పేరు, పిన్‌ కోడ్‌, పాన్‌ లేదా జీఎస్టీఎన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ చేయాల్సిన వ్యక్తి నెంబర్‌, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్టర్ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చు.

1-5 నుంచి 50 వరకు, ఆపైనా బల్క్‌ ఆర్డర్లను బిజినెస్‌ కస్టమర్లు చేపట్టవచ్చని జియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కేవలం జియో ఫోన్‌ మాత్రమే కాక, జియోఫై డివైజ్ ను కూడా యూజర్లు బల్క్‌గా ఆర్డర్‌ చేయవచ్చు.

ఒక్కసారి నియమ, నిబంధనలను అంగీకరించి, సబ్మిట్‌ బటన్ నొక్కితే, రిజిస్టర్ అయినట్లుగా ఒక మెసేజ్‌ వస్తోంది. అంతేకాక ఈమెయిల్‌ ఐడీకి, ఫోన్ నెంబర్ కు కూడా మెయిల్‌, మెసేజ్ అందుతుంది. ఇంకే మరి, మీకెలా కావాలంటే అలా.. వెంటనే రిజిస్టర్ చేసుకోండి.

English summary
JioPhone was launched at Reliance's 40th annual general meeting held in Mumbai. After the smart specs that the phone will apparently come with, the second most striking thing about the device is its pricing. The company says that the phone will be effectively free which means it would cost you zero. This announcement alone was enough to shake up the feature phone market. But seems that Jio would not stop here. The company on its registration page for JioPhone has secretly added a new option that would allow the users to purchase the device in bulk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X