వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అఫ్జల్ గురు అమరవీరుడైతే.. హనుమంతప్ప ఎవరు?’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జేఎన్‌యూలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్యార్థులు నిరసన తెలపడంపై ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాది అఫ్జల్ గురు అమరవీరుడైతే.. దేశం కోసం ప్రాణాలు వదిలిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఎవరు?' అని యోగేశ్వర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యోగేశ్వర్.. దేశభక్తిపై ట్విట్టర్‌లో ఓ పద్యం రాశారు.

పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును, జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు మక్బుల్ భట్‌ల ఉరికి నిరసనగా ఫిబ్రవరి 9న పలువురు విద్యార్థులు జేఎన్‌యూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు.

దేశద్రోహం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఇతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

English summary
Expressing disappointment over ongoing protest in JNU over freedom of speech, Well-known wrestler Yogeshwar Dutt posted a heart touching poem on Twitter asking If Afzal Guru a martyr, who was Lance Naik Hanumanthappa?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X