వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు 5వేల ఏళ్లది ఐతే ఏంటి: జయకు సుప్రీం షాక్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాట విశేష ప్రాచుర్యం ఉన్న జల్లికట్టు సంప్రదాయ ఆట.. వేల ఏళ్ల నాటిదని, దానిని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న వాదనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రశ్నలు సంధించింది.

జల్లికట్టు ఐదు వేల ఏళ్ల క్రితం నాటి సంప్రదాయం ఆట అయితే ఏమిటని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆ ఆట ఎన్ని వేల సంవత్సరాలది అయినా కావొచ్చని, కానీ అది ఆడటం సరైనదా కాదా అనేది చట్టం చెప్పాలని పేర్కొంది. ఏ నిర్ణయమైనా చట్టానికి లోబడి ఉండాలని తెలిపింది.

పూర్వం 1899లో 12 కంటే తక్కువ వయసున్న పదివేల మంది అమ్మాయిలకు వివాహం చేశారని, సంప్రదాయమని ఇప్పుడు అలాగే చేస్తామా అని ప్రశ్నించింది. జల్లికట్టు అంశంపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తమిళనాడులో జల్లికట్టు ఆటపై నిషేధం ఎత్తివేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంలో స్టే ఉంది. దీనిపై ఆగస్టు 23 నుంచి తుది విచారణ జరగనుంది.

జల్లికట్టు

జల్లికట్టు

జల్లికట్టు వేల ఏళ్లనాటి సంప్రదాయ ఆట కనుక దాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. వారి వాదనను తిరస్కరించింది.

జల్లికట్టు

జల్లికట్టు

జల్లికట్టు ఆట విషయం రాజ్యాంగ, చట్టపరమైన అంశమని, చట్టప్రకారం అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దానిపై విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని సుప్రీం వెల్లడించింది.

జల్లికట్టు

జల్లికట్టు

జల్లికట్టులో ఎద్దులను హింసకు గురిచేస్తున్నారని జంతు పరిరక్షణ కార్యకర్తలు వేసిన పిటిషన్‌పైనా కోర్టు విచారణ జరిపింది.

జల్లికట్టు

జల్లికట్టు

తమిళనాడులో జల్లికట్టు ఆటకు అనుమతి కోసం అక్కడి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జల్లికట్టు

జల్లికట్టు

కాంగ్రెస్‌ హయాంలో ఈ ఆటపై నిషేధం విధించారు. జల్లికట్టు ఆడే సమయంలో గతంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. వందలమంది గాయాలపాలయ్యారు.

English summary
The Supreme Court+ said on Tuesday it has set August 30 as the final hearing date to decide on the constitutionality of Jallikattu+ , but it asserted it disapproves of arguments that the 'sport' should be allowed because it's centuries old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X