వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమి హంతకుడు మహేష్‌ను ఉరి తీయాలని బంద్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పీయుసీ విద్యార్థిని గౌతమి (18)ని దారుణంగా పిస్తోల్ తో కాల్చి హత్య చేసిన కిరాతకుడు అటెండర్ మహేష్ ను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లో స్వచ్చందంగా బంద్ నిర్వహించారు.

గురువారం ఉదయం నుండి అన్ని వ్యాపారలావాదేవీలు మూతపడ్డాయి. వ్యాపారులు అందరూ స్వచ్చందంగా బంద్ లో పాల్గోన్నారు. పార్టీలకు అతీతంగా అన్నిరాజకీయ పార్టీల నాయకులు బంద్ లో పాల్గోన్నారు. పావగడలోని వందలాధి మంది గురువారం ఉదయం పావగడలో బైక్ ర్యాలి నిర్వహించి అటెండర్ మహేష్ ను బహిరంగ ప్రదేశంలో ఉరి తియ్యాలని నినాదాలు చేశారు.

బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో గౌతమి మృతదేహాన్ని పావగడలోని పతాంజలి నగరలోని ఆమె ఇంటి దగ్గరకు తీసుకు వెళ్లారు. గౌతమి మృతదేహాన్నిచూసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేశారు. పై చదువులు చదువుకుని విదేశాలకు వెలుతానని చెప్పిన గౌతమి పై లోకాలకు వెళ్లిపోయిందని విలపించారు.

Kadugodi police arrested accused school attender Mahesh on wednesday

గురువారం స్థానిక శాసన సభ్యుడు తిమ్మరాయప్ప, మాజీ మంత్రి వెంకటరమణప్ప, పావగడ పురసభ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, జేడీఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిమ్మారెడ్డి, డాక్టర్ జీ. వెంకటరమణప్ప, కౌన్సిలర్ వసంత్ తదితరులు గౌతమికి నివాళులు అర్పించారు.

బెంగళూరులోని ప్రగతి కాలేజ్ లో గౌతమితో పాటు విద్యాభ్యాసం చేస్తున్న సాటి విద్యార్థులు గురువారం ఉదయం పావగడ చేరుకున్నారు. తన స్నేహితురాలకి కన్నీటితో విడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గురువారం మద్యాహ్నం పావగడలో గౌతమి అంత్యక్రియలు నిర్వహించారు. వేలాధి మంది అంత్యక్రియలలో పాల్గోన్నారు. ఏ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగరాదని పలువురు అన్నారు.

English summary
18-year-old 2nd PUC student Gowthami was shot to death at her hostel at Kadugodi, Bengaluru. Kadugodi police arrested accused school attender Mahesh on Wednesday, April 1, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X