వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం'గా కలాం ట్విట్టర్ ఐడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినా ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ కొత్త పేరుతో సాగనుంది. అబ్దుల్ కలాంకు అత్యంత సన్నిహితులు 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ను కొనసాగించాలని నిర్ణయించారు.

Kalam's Twitter account to remain alive in new form

డాక్టర్ కలాం ఆలోచనలు, పాఠాలు, ప్రణాళికలను ట్విట్టర్లో పంచుకుంటామని ఆయన సన్నిహితులు చెప్పారు. కలాంతో సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్.. ఈ ట్విట్టర్ అకౌంట్ బాధ్యతలు చూస్తున్నారు. మిస్ యూ సర్ అంటూ శ్రీజన్ పాల్ సింగ్ ట్వీట్ చేశారు.

డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక సందేశాలు, ఆయన ఉపన్యాసాలు ఈ ట్విట్టర్ హ్యాండ్లర్ నుంచి ట్విట్ చేస్తారు. అదే విధంగా అబ్దుల్ కలాం రచించిన రచనలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇండియా 2020', 'ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', అడ్వాంటేజ్ ఇండియా' తదితర పుస్తకాలలోని ముఖ్యమైన వ్యాఖ్యాలను కూడా ట్వీట్ చేస్తారు. ట్విట్లర్‌లో అబ్దుల్ కలాంకు 14 లక్షల 3 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

English summary
Although former President A P J Abdul Kalam is no more, but his Twitter account will continue to be active in a new form. A team of his close associates has decided to run his official Twitter account which has now been renamed as 'In memory of Dr Kalam'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X