వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాడ్ కేసులో కన్నడ నటి అరెస్ట్, చెట్టుకు ఉరేసుకొని ముగ్గురి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మోసానికి పాల్పడిన కేసులో కన్నడ నటి మరియా సుసైరాజ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజన్సీ ద్వారా హజ్ యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి అర్థాంతరంగా టిక్కెట్లు రద్దు చేసి డబ్బు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

ఈ విధంగా ఆమె సుమారు రూ.2.68 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. మారియా సుసైరాజ్‌ వయస్సు 35.

ఆమె మాజీ మోడల్ కూడా. కర్ణాటకలోని మైసూరులో ఆమెను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపార భాగస్వామి పరోమిత చక్రవర్తి కలిసి మారియా... వడోదరలో కొన్ని నెలల క్రితం విమాన టికెట్ల బుకింగ్‌ ఏజెన్సీని ప్రారంభించింది.

Kannada actress Maria Susairaj arrested by Gujarat police

స్థానిక హజ్‌ యాత్రికుల తరఫున టికెట్లు బుక్‌ చేశారు. అయితే, టికెట్లు రద్త్దెన తర్వాత వెనక్కి ఇవ్వాల్సిన రూ.2.68 కోట్లను కాజేసినట్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టికెట్ల రద్దు విషయం కూడా ప్రయాణికులకు తెలియజేయలేదని అభియోగాలు నమోదయ్యాయి.

చక్రవర్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ప్రముఖ టీవీ నిర్మాత నీరజ్‌ గ్రోవర్‌ హత్యకేసులోనూ 2008లో మారియా అరెస్టయ్యారు. సాక్ష్యాధారాలను ధ్వంసంచేసినందుకుగాను ఈ కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించి 2011 జులైలో ఆమె విడుదలయ్యారు.

చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

ఒడిశాలోని మునిగుడ సమితి అంబాదల గ్రామ శివారులో ఒకే చెట్టుకు ముగ్గురు విద్యార్థులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంబాదల సమీపంలోని అమలాచాడ గ్రామానికి చెందిన రాధిక, జగపాత్ర్, అలోక్ కుమార్‌లు గురువారం గ్రామ శివారులో ఉన్న తోటలో ఒకే చెట్టుకు ఉరి వేసుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

English summary
Kannada actress Maria Susairaj arrested by Gujarat police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X