వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 8,165 కోట్ల రైతుల బ్యాంకు రుణాలు రద్దు: 22, 27, 506 మంది అన్నదాతలు హ్యాపి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం రైతుల రుణాలు రద్దు చేస్తున్నామని సంచలన ప్రకటన చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నిధుల కేటాయింపు, వివిద డిమాండ్ల విషయంలో బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. తరువాత ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమాధానం ఇచ్చారు.

కర్ణాటకలోని రైతుల కష్టాలను పరిగణలోని తీసుకుని ప్రతి ఒక్క రైతుకు రూ. 50,000 రుణం రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని 22, 27, 506 మంది రైతులకు రూ. 50 వేలు చోప్పున రుణం రద్దు కానుంది.

జూన్ 20వ తేదీ ముందు వరకు రైతులు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని సిద్దరామయ్య ప్రకటించారు. ఇదంతా కర్ణాటకలో జరగనున్న శాసన సభ ఎన్నికల (2018) సందర్బంగా కాంగ్రెస్ పార్టీ గిమ్మిక్కు చేసిందని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద మండిపడుతున్నారు.

ప్రభుత్వం మీద రూ. 8,165 కోట్ల భారం !

ప్రభుత్వం మీద రూ. 8,165 కోట్ల భారం !

22,27, 506 మంది రైతుల బ్యాంకు రుణాలు రద్దు చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వం మీద రూ. 8,105 కోట్ల భారం పడింది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణంలో రూ. 50 వేలు రద్దు చేసిన ప్రభుత్వం ఆనిధులు ప్రభుత్వమే చల్లించడానికి సిద్దం అయ్యింది.

బీజేపీకి మాట్లాడే అర్హతలేదు

బీజేపీకి మాట్లాడే అర్హతలేదు

రైతుల రుణం రద్దు చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు. రైతుల రుణం రద్దు చెయ్యాలని డిమాండ్ చేసే హక్కు బీజేపీ నాయకులకు లేదని, అసలు రైతు సమస్యల మీద మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదని సిద్దరామయ్య అన్నారు.

ప్రధాని మోడీ పట్టించుకోలేదు

ప్రధాని మోడీ పట్టించుకోలేదు

కరువు కారణంగా కర్ణటకలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ప్రతిసారి మనవి చేస్తున్నామని అయినా ఆయన ఏ మాత్రం స్పందించలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.

మేము ఒత్తిడి చేశాం, అందుకే రద్దు చేశారు

మేము ఒత్తిడి చేశాం, అందుకే రద్దు చేశారు

మేము ఒత్తిడి చెయ్యడం వలనే కర్ణాటక ప్రభుత్వం రైతు రుణాలు రద్దు చేసిందని, అందులో వారి గొప్ప ఏమీ లేదని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ అన్నారు. రైతుల రుణం రద్దు చెయ్యాలని బీజేపీ మొదటి నుంచి పోరాటం చేస్తోందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలు రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలు రద్దు చెయ్యాలి

రైతుల రుణం రద్దు చేస్తున్నామని ప్రకటించడం కాదు, మీ హయంలోనే బ్యాంకులకు డబ్బలు చెల్లించాలని, కొత్తగా వచ్చే ప్రభుత్వం మీద భారం వెయ్యకూడదని మాజీ సీఎం, బీజేపీ నాయకుడు జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రైతుల రుణం రద్దు చెయ్యడాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల రుణాలు రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Siddaramaiah led Congress government in Karnataka waives Rs 8,165 crore farmer loans, sets poll agenda. Waiver is going to cost the exchequer Rs 8,165 crore, it is expected to benefit 22,27,506 farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X