వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే కాశ్మీర్ మరో సిరియా అవుతుంది: సీఎం సంచలన వ్యాఖ్యలు

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీర్‌ విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆయన చెప్పినట్లు కాశ్మీర్‌ విషయంలో అమెరికా వంటి దేశాలు తలదూరిస్తే కాశ్మీర్‌ మరో సిరియా అవుతుందని వ్యాఖ్యానించారు.

కాశ్మీర్‌ సమస్యపై శుక్రవారం ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే అమెరికా, చైనా వంటి మూడో దేశాల జోక్యం అవసరమని పేర్కొన్నారు. దీనిపై ముఫ్తీ తీవ్రంగా స్పందించారు.

Kashmir would become Syria, Iraq if America intervenes: Mehbooba Mufti on third party intervention

అమెరికా వంటి దేశాలు ఇందులో తలదూరిస్తే కాశ్మీర్‌ లోయ మరో సిరియానో, అఫ్గానిస్థాన్‌గానో మారుతుందన్నారు. చైనా, అమెరికా వారి పనిని వారు చూసుకోమనండని అన్నారు. వాళ్లు మధ్యవర్తిత్వం వహించిన అఫ్గానిస్తాన్‌, సిరియా, ఇరాక్‌ పరిస్థితేంటో మన కళ్లముందే కనిపిస్తోందని అన్నారు.

అసలు అఫ్గానిస్తాన్‌, సిరియాలో ఏం జరుగుతుందో ఫరూక్‌కు తెలుసా? అని ఎద్దేవా చేశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఇరు దేశాలు కలిసి చర్చించుకోవడం ద్వారానే సాధ్యమని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్ భారత అంతర్గత విషయమని, దానిపై మరో దేశం జోక్యం అవసరం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti on Saturday criticized National Conference (NC) president Farooq Abdullah for his remarks on Kashmir issue and said that the situation in Kashmir Valley would be same as Syria and Afghanistan if America intervenes on the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X