వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా, సత్య నాదెళ్ల, అమీర్‌ఖాన్‌ను దాటి దూసుకెళ్తున్న కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎన్‌ఎన్ ఐబీఎన్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సర్వే ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూసుకెళ్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు అందనంత దూరంగా కేసీఆర్ ఉన్నారు. 2006 నుంచి సీఎన్‌ఎన్ - ఐబీఎన్ ఈ ఆన్‌లైన్ పోటీ నిర్వహిస్తోంది.

పోటీలో తొలి పది మందికి ప్రస్తుతం లభించిన ఓట్లను బట్టి కేసీఆర్ ఎంతో ముందున్నారు. కేరళలో మాదక ద్రవ్యాల మాఫియా నడుం విరిచిన ఐపీఎస్ అధికారి విజయన్ తొలుత మొదటి స్థానంలో ఉండేవారు. కేసీఆర్, విజయన్ మధ్య తొలుత ఒక్క శాతం ఓట్ల తేడా కనిపించింది.

కేసీఆర్ పోటీలో రెండవ స్థానంలో ఉన్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రారంభం అయింది. అనంతరం కేసీఆర్‌కు ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. రాజకీయం, క్రీడలు, సామాజిక సేవ, వంటి వివిధ రంగాల్లో ప్రత్యేకతలు చూపిన వారిని మాత్రమే ఈ పోటీకి ఎంపిక చేశారు.

KCR is no 1 in race for Indian of the Year award 2014 KCR is no 1 in race for Indian of the Year award 2014

తెలంగాణ సాధన కోసం 60 ఏళ్ల నుంచి సాగిన ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఫలించి సాకారమైనసందర్భాన్ని పేర్కొంటూ పోటీలో కేసీఆర్ పేరు చేర్చారు. మొదటి పది మందిలో కేసీఆర్‌కు ఇతరులకు మధ్య ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది. ఇప్పటి వరకు కేసీఆర్‌కు 31శాతం ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ఉన్న విజయన్‌కు 21శాతం ఓట్లు లభించాయి.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు 7శాతం ఓట్లతో మూడవ స్థానంలో, సామాజిక సమస్యలపై టీవిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన అమీర్ ఖాన్ 6 శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో, ఇండియన్ ఆర్మీకి 5శాతం ఓట్లు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్లకు నాలుగు శాతం, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు నాలుగు శాతం, ఇండియన్ హాకీకి 2శాతం ఓట్లు లభించాయి.

English summary
Telangana State CM KCR is no 1 in race for Indian of the Year award 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X