వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి విద్యార్ధిని కాను: మోడీ, మంత్రులకు విందు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తాను మంచి విద్యార్దిని కాదని, ఎప్పుడూ అవార్డు అందుకోలేదని అన్నారు.

ఎల్లప్పుడూ విద్యార్దిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని.. విద్యార్ది దశ అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దని మోడీ విద్యార్దులకు సూచించారు. స్నాతకోత్సవానికి ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిని అతిధిగా పిలవడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధులు స్పూర్తి పొందుతారని తెలిపారు.

ఈ భావన విద్యార్ధుల్లో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. వైద్యరంగంలో పరిశోధనలపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు.

Keep the Student in you Alive, Advises PM Narendra Modi

మంత్రులకు ప్రధాని మోడీ విందు

ప్రధాని మోడీ సోమవారం సాయంత్రం తన మంత్రి వర్గంలోని 44 మంది మంత్రులకు విందు ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం కేబినేట్ సమావేశం అనంతరం ఈ విందు ఉంటుంది.
ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మోడీ ఇస్తున్న ఈ విందు ప్రాధాన్యం సంతరించుకుంది.

పలు కీలక అంశాలపై తన మంత్రులతో మనసు విప్పి చర్చించేందుకే మోడీ ఈ విందును ఏర్పాటు చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం అనుసరించాల్సిన విధివిధానాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ విందులో మంత్రులతో మోడీ చర్చించనున్నారని సమాచారం.

మోడీ ప్రతిపాదనను తిరస్కరించిన గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రధాని మోడీ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇంతకీ ఏంటీ ఆ ప్రతిపాదన అనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్ర వ్యాపార రాజధాని అహ్మదాబాద్ మీదుగా సర్ఖెజ్-గాంధీనగర్ ప్రధాన రహదారిని
నిర్మించడం. ఈ ప్రతిపాదనను ఆనంది బెన్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

ఈ రహదారి అభివృద్ధికి తామే నిధులిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించినా ఆనందిబెన్ పటేల్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. అయితే, ఆనందిబెన్ పటేల్ తిరస్కరణ సరైందే అంటున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. జన సంచారం అత్యధికంగా ఉండే అహ్మదాబాద్ మార్కెట్ మీదుగా ప్రధాన రహదారిని ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఆనందిబెన్‌ పటేల్‌కు వారు మద్దతు పలికారు.

English summary

 PM Narendra Modi today addressed the 42nd annual convocation of the All India Institute of Medical Sciences (AIIMS) in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X